పాకిస్థాన్ లో ఆఫ్ఘన్ రాయబారి నజీబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్ సిలా కిడ్నాప్, టార్చర్ ఘటనపై పాకిస్తాన్ ఇండియాపై చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. గత శుక్రవారం ఆమెను ఇస్లామాబాద్ లో దుండగులు కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టిన ఘటనపై ఆ దేశ హోమ్ మంత్రి షేక్ మహ్మద్ రషీద్ స్పందిస్తూ.. ఇందులో పరోక్షంగా ఇండియా పాత్ర ఉందని అన్నారు. రావల్పిండిలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. పాకిస్థాన్ దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ఆఫ్ఘన్, ఇండియా దేశాలు వినియోగించుకున్నాయని ఆరోపించారు. ఇది తమ దేశాన్ని అస్థిర పరచే యత్నంలో భాగమేనన్నారు. కిడ్నాపింగ్ వంటిదేమీ జరగలేదని ఆయన చెప్పారు. ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఈ వివాదంలోకి ఇండియాను ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో మీదేశ పరువు పూర్తిగా దిగజారిందన్నారు. అసలు ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ జరగక ముందే ఎలా నిర్ధారణకు వస్తారన్నారు.
సిల్ సిలా ఘటనతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పాక్-ఆఫ్ఘన్ దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాక్ లోని తమ రాయబారిని, దౌత్యాధికారులను ఆఫ్ఘన్ ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. ఈ కిడ్నాపింగ్ వ్యవహారంలో దుండగులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం పాకిస్థాన్ ను ప్రశ్నించింది. మా దేశంలో తాలిబాన్లకు మీరు మద్దతునిస్తున్నారని, మా దేశ సార్వభౌమాధికారాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: India Corona Cases: దేశ ప్రజలకు కాస్త ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు, 500 దిగువకు మరణాలు..
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ భద్రంగా ఉండాలంటే ఈ పనులు చేయాలంటున్న బ్యాంక్..