India-China stand-off: భారత్‌ – చైనా మధ్య ప్రతిష్టంభన తొలిగేనా..? నేడు 13వ దఫా చర్చలు..

India-China border row: భారత్-చైనా సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలనే సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు

India-China stand-off: భారత్‌ - చైనా మధ్య ప్రతిష్టంభన తొలిగేనా..? నేడు 13వ దఫా చర్చలు..
India China Stand Off
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 10, 2021 | 7:03 AM

India-China border row: భారత్-చైనా సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలనే సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పూనుకోగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన అనంతరం మళ్లీ సరిహద్దు వివాదం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో ఇరు దేశాలు ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆదివారం జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే.. ఈ చర్చల్లో తూర్పు లఢఖ్ ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్‌ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ చర్చలు చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ చర్చల్లో భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ చర్చల్లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు భారత్ పట్టుబట్టే అవకాశం ఉంది. కాగా..12వ విడత చర్చలు చివరిసారిగా జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్‌ నుంచి ఇరు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది.

ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్‌ ముకుంద్‌ నరవణె శనివారం మాట్లాడారు. తూర్పు లఢక్‌ ప్రాంతంలో చైనా బలగాలను మోహరిస్తుండటం, నిర్మాణాలను చేపడుతుండటం ఆందోళనకరమైన అంశమని ఆర్మీ చీఫ్‌ తెలిపారు. చైనా కదలికలపై కన్నేసి ఉంచామని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Also Read:

Danish PM India Tour: ప్రధాని మోడీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. భారత పర్యటనలో డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్

Mysterious Disease: ఆ దేశాన్ని హడలెత్తిస్తున్న వింత వ్యాధి.. ఇప్పటికే ఆరుగురు మృతి.. పూర్తి వివరాలు