India – China standoff: భారత్ – చైనా మధ్య గత కొంతకాలం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా.. భారత సైన్యంపై దుశ్చర్యకు పాల్పడిన నాటినుంచి సరిహద్దుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తూర్పు లఢఖ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. సరిహద్దు వివాదంలో అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకోమంటూ ఆయన స్పష్టంచేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరినట్లు ఆయన వెల్లడించారు. దశల వారీగా రెండు దేశాలు తమ తమ బలగాలను ఉపసంహరిస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు.
అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలకు పరిష్కారం కాలేదని అవి పరిష్కారం అయ్యేంతవరకు చర్చలు కొనసాగుతాయని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనాలంటే.. భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని చైనాకు స్పష్టంచేసినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఘర్షణల అనంతరం చైనా ఎల్ఏసీ వెంబడి దళాలతోపాటు ఆయుధ సంపత్తిని పెంచిందని.. ఈ క్రమంలో భారత్ కూడా ధీటుగా స్పందించిందని తెలిపారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో మన ధైర్యవంతమైన జవాన్లు ఉన్నారని.. వారంతా దేశ సమగ్రత కోసం ఎంత వరకైనా వెళ్తామన్నారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ గుర్తుచేశారు.
Also Read: