Central Cabinet: అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన మోడీ సర్కార్‌.. పంటల కనీస మద్దతు ధర పెంపు..

MSP for Kharif Crops: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Central Cabinet: అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన మోడీ సర్కార్‌.. పంటల కనీస మద్దతు ధర పెంపు..
Pm Modi

Updated on: Jun 07, 2023 | 6:20 PM

MSP for Kharif Crops: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 సంవత్సరానికి గాను ఖరీఫ్‌ సీజన్‌లో పండిన పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు ఏడు శాతం పెంచారు. పెసర్లపై ఎంఎస్‌పీని 10 శాతానికి పెంచారు. కందులపై కనీస మద్దతుధర 7 శాతం పెంచారు. జొన్న ఇతర పంటలపై కూడా కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి క్వింటాకు రూ.143 మేర పెంచి. రూ.2,183 గా నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరకు రూ.163 మేర పెంచి.. రూ.2,203 ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ.8,558 గా నిర్ణయించింది. .

పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభదాయకంగా మారుతుందని.. ఆర్థికంగా చేయూతనిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రైతులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని పీయూష్‌ గోయెల్‌ వివరించారు.. గతంలో ఎన్నడు లేని విధంగా ఖరీఫ్‌ సీజన్లో మంటలకు కనీస మద్దతు ధరను భారీగా పెంచినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి వ్యవసాయ రంగం సంక్షేమానికి అంకితమయ్యారని.. ఖరీఫ్ పంటలపై ఎంఎస్‌పీని పెంచారని పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని ఆహార ప్రదాతలకు పంటల ఉత్పత్తి నుంచి మరిన్ని ప్రయోజనాలను నిర్ధారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో సహాయకరంగా ఉంటుందన్నారు.

దీంతోపాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీఎస్ఎన్ఎల్ కోసం రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించినట్లు సమాచారం. ఈ క్రమంలో దేశంలో బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం కేంద్ర సర్కార్‌ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..