మా జోలికొస్తే అంతే.. టర్కీని చావు దెబ్బ కొడుతున్న సామాన్య భారతీయులు!

పాకిస్తాన్‌కు టర్కీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో భారత వ్యాపారవేత్తలు టర్కిష్ ఆపిల్స్‌ను బహిష్కరించారు. ఈ నిర్ణయం వలన ఇరాన్, అమెరికా, న్యూజిలాండ్ ఆపిల్స్‌ ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల ఆపిల్ ధర రూ.200 నుండి రూ.300కు, రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.20 నుండి రూ.30కు పెరిగింది.

మా జోలికొస్తే అంతే.. టర్కీని చావు దెబ్బ కొడుతున్న సామాన్య భారతీయులు!
Turkey Apple

Updated on: May 12, 2025 | 2:43 PM

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. కానీ పాకిస్తాన్ తిరిగి భారత్‌పై సైనిక దాడికి దిగింది. ఆ దాడికి తగిన విధంగా ప్రతిస్పందిస్తూ భారత్‌ తిప్పికొట్టింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాయి. భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అయితే కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు మద్దతు తెలిపాయి. వాటిలో టర్కీ ఒకటి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీపై భారత వ్యాపారవేత్తలు విరుచుకుపడ్డారు. ‘టర్కీని నిషేధించండి’ అని నినాదాలు చేస్తూ వ్యాపారులు టర్కిష్ ఆపిల్‌లను బహిష్కరించారు.

ఫలితంగా ఇరాన్ నుండి వచ్చే ఆపిల్స్ ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల ఆపిల్ ధర రూ.200 నుండి 300 వరకు పెరగగా రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.20 నుండి 30 వరకు పెరిగింది. పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం వల్ల భారత వ్యాపారవేత్తలు తీసుకున్న నిర్ణయంతో టర్కిష్ ఆపిల్స్‌ బదులుగా ఇరానియన్, వాషింగ్టన్, న్యూజిలాండ్‌ ఆపిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరానియన్, వాషింగ్టన్, న్యూజిలాండ్ ఆపిల్‌ ధరలు ఒక్కో బాక్స్‌కు రూ.200 నుండి 300 వరకు పెరిగినట్లు సమాచారం. నిజానికి ఆపిల్ మార్కెట్లలో తక్కువగా లభిస్తున్నప్పటికీ.. ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిందనే కారణంతో వ్యాపారవేత్తలు టర్కీ ఆపిల్స్‌ను నిషేధించారు. వ్యాపారులు తమ దేశాన్ని, దేశాన్ని ముందుంచాలనే వైఖరిని అంతా అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి