Big Breaking: భారత్- పాక్‌ మధ్య కాల్పుల విరమణ.. ఇరుదేశాలు అధికారిక ప్రకటన!

పాక్‌- భారత్‌ ఇరు దేశాలు కాల్పుల విరమణకు గ్నీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మధ్యవర్తిత్వం ఫలించి ఈ మేరకు రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి పాక్‌, భారత్‌ రెండు దేశాలు అధికారికంగా ప్రకటించాయి.

Big Breaking: భారత్- పాక్‌ మధ్య కాల్పుల విరమణ.. ఇరుదేశాలు అధికారిక ప్రకటన!
India, Pak Have Agreed To Stop All Military Action

Updated on: May 10, 2025 | 7:35 PM

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఇరు దేశాలకు అభినందనలు తెలియజేస్తున్నానన్న అమెరికా అధ్యక్షుడు.. రెండు దేశాలు సమయస్పూర్తితో వ్యవహరించాయని ఎక్స్‌ ద్వారా పేర్కొన్నారు.

మూడు రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్‌లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది భారత్. అయితే ఇందుకు ప్రతిగా భారత్‌పై దాడులకు దిగింది పాకిస్తాన్. కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరిహద్దు నగరాలపై డ్రోన్ల, ఫైటర్ జెట్లతో దాడులు చేసింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం.. పాక్‌ సైనిక స్థావరాలు, వైమానిక కేంద్రాలపై ప్రతిదాడులు చేసింది.

అయితే భారత్ దెబ్బకు అల్లాడిపోయిన పాకిస్తాన్.. భారత్ దాడులు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని ప్రకటించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది పాకిస్తాన్. దీంతో రంగంలోకి దిగిన అమెరికా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు చేపట్టింది. ఇరు దేశాల కాల్పుల విరమణ పాటించేలా ఒప్పించాయి.

మరోవైపు భారత్‌, పాక్‌తో చర్చలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో స్పష్టత ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో కలిసి ఇరుదేశాలతో చర్చించినట్టు ప్రకటించారు. దీనిపై ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడినట్టు తెలిపారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్‌తో చర్చలు జరిపామని వివరించారు. అటు పాక్ ఆర్మీ చీఫ్‌ అసిఫ్‌ మునీర్‌, పాక్‌ ఎన్‌ఎస్‌ఏ మాలిక్‌తో చర్చించామన్నారు. మోదీ, షరీఫ్‌ దౌత్య స్ఫూర్తిని చాటుకున్నారని తెలిపారు. గత రాత్రంతా జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం భారత్‌, పాకిస్తాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కాసేపటికే న్యూఢిల్లీ నుంచి భారత విదేశీ వ్యవహారాల మంత్రి మిస్రీ ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్‌ ప్రకటన అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.

భారత్‌, పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు చర్చలు.. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్

కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్‌, పాకిస్థాన్‌లు ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. భారత్ అన్ని కోణాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్థిరమైన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుంది. అది అలాగే కొనసాగుతుందని విదేశాంగ మంత్రి జయశంకర్  ట్వీట్ చేశారు.