పాకిస్తాన్‌కు అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి భారీగా అప్పు..! భారత్ అభ్యంతరం..

గతంలో తీసుకున్న అప్పులను పాక్‌ సక్రమంగా వినియోగించులేదని ఆరోపించింది. ఐఎంఎఫ్‌ నుంచి నిధులు వస్తూ ఉంటే.. పాక్‌ వాటిని సైన్యానికి, ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదుల కోసం వినియోగిస్తుందని భారత్‌ ధ్వజమెత్తింది. ఆ నిధులను పాక్‌ సక్రమంగా వినియోగించి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేదని చెప్పుకొచ్చింది భారత్.

పాకిస్తాన్‌కు అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి భారీగా అప్పు..! భారత్ అభ్యంతరం..
Imf Voting

Updated on: May 10, 2025 | 12:09 PM

అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (IMF) చివరకు పాకిస్తాన్‌కు రుణం ఇచ్చేందుక అంగీకరించింది. 1 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు రూ.8540 కోట్లు.)అదే పాకిస్థాన్‌ కరెన్సీలో దాదాపు రూ.28 వేల కోట్ల రుణం అందించడానికి అంగీకరించింది. ఐఎంఎఫ్‌ పాకిస్తాన్‌కు రుణాలు అందించటంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రుణ ప్రతిపాదనను ఓటింగ్‌కు ఉంచినప్పుడు భారతదేశం మాత్రమే ఆ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఐఎంఎఫ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికే భారతదేశం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ కింద ఇవ్వదలచిన 700 కోట్ల డాలర్లలో 100 కోట్ల డాలర్ల విడుదల, కొత్త అప్పు కింద మరో 130 కోట్ల డాలర్లు.. మొత్తం కలిపి 230 కోట్ల డాలర్ల రుణం ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఐఎంఎఫ్‌ శుక్రవారం బోర్డు మీటింగ్‌ నిర్వహించింది. కానీ, పాక్‌ అప్పు ఇచ్చే విషయంలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా భారతదేశం తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. అధికారికంగా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

గత35 ఏళ్లలో 28 సార్లు పాక్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాలు తీసుకుందని, గడిచిన ఐదేళ్లలో నాలుగు ఐఎంఎఫ్‌ ప్రోగ్రామ్‌లు పాక్‌లో అమలయ్యాయని గుర్తుచేసింది. కానీ, ఆ రుణాలు ఇచ్చే సమయంలో ఐఎంఎఫ్‌ పెట్టే షరతులకు కట్టుబడి ఉండడంలో, వాటిని అమలు చేయడంలో మాత్రం పాక్‌కు ఎప్పుడు కట్టుబడి లేదని, ఈ విషయాల్లో పాక్‌కు ఎక్కడా మంచి రికార్డు లేదని భారత్‌ ధ్వజమెత్తింది. గతంలో తీసుకున్న అప్పులను పాక్‌ సక్రమంగా వినియోగించులేదని ఆరోపించింది. ఐఎంఎఫ్‌ నుంచి నిధులు వస్తూ ఉంటే.. పాక్‌ వాటిని సైన్యానికి, ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదుల కోసం వినియోగిస్తుందని భారత్‌ ధ్వజమెత్తింది. ఆ నిధులను పాక్‌ సక్రమంగా వినియోగించి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేదని చెప్పుకొచ్చింది భారత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..