Taxpayers: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఐటీ పోర్టల్‌.. ఇన్ఫోసిస్‌తో చర్చలు: కేంద్ర మంత్రి

|

Aug 17, 2021 | 12:40 PM

Taxpayers: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర సర్కార్‌ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు..

Taxpayers: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఐటీ పోర్టల్‌.. ఇన్ఫోసిస్‌తో చర్చలు: కేంద్ర మంత్రి
Follow us on

Taxpayers: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర సర్కార్‌ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు విషయంలో ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు కొద్ది వారాల్లో పరిష్కారం అవుతాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌తో నిరంతరం చర్చిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇన్ఫోసిస్‌ హెడ్‌ నందన్‌ నీలేకని కూడా ఈ మేరకు హామీ ఇస్తూ తనకు నిరంతరం సందేశాలను పంపుతున్నట్లు తెలిపారు. కొత్త ఆదాయపు పన్ను 2 ఫైలింగ్‌ పోర్టల్‌ అభివృద్ధికి సంబంధించి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. అయితే 2019 జనవరి నుంచి జూన్‌ 2021 మధ్య ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్‌టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త వెబ్‌ సైట్‌ కారణంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో త్వరలో ఈ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. అయితే పన్ను చెల్లింపుల విషయంలో పదేపదే సమస్యలు తలెత్తుతున్నందున పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.

కొత్త వెబ్‌సైట్‌తో ఇబ్బందులుండవు..

అయితే ఈ కొత్త వెబ్‌సైట్‌తో ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్‌ సులభంగా దాఖలు చేయవచ్చు. తక్కువ సమయంలోనే రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. అయితే సోమవారం ఆదాయపు పన్ను కొత్త ఐటీ పోర్టల్‌ సాంకేతిక లోపాలను ఎంతకాలం అధిగమిస్తామో అనే విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వివరించారు. వచ్చే రెండు, మూడు వారాల్లో కొత్త పన్ను పోర్టల్‌లో వస్తున్న సాంకేతిక లోపాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఇంతకు ముందు వెబ్‌సైట్‌ మేకర్‌ ఇన్ఫోసిస్‌ కూడా వెబ్‌సైట్‌ యొక్క అన్ని లోపాలను తొలగించడానికి వేగవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

2019లో దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌కు కొత్తవెబ్‌సైట్‌ను సిద్ధం చేయడానికి కాంట్రాక్ట్‌ ఇవ్వబడింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను చెల్లింపులు జరిపే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పన్ను చెల్లింపులు వేగవంతం చేసేందుకు కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ www.incometax.gov.in 7 జూన్ 2021 ప్రారంభించారు. అయితే మొదటి నుంచి పోర్టల్‌లో సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి జూన్‌ 22న కంపెనీతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌ రెండు, మూడు వారాల్లో సమస్యలు తొలగిపోయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ కార్యదర్శి పన్ను పోర్టల్ లోపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు పాత పోర్టల్‌కి తిరిగి వెళ్లలేము. ఎందుకంటే ఇది చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది. వెబ్‌సైట్‌లో కొనసాగుతున్న పనికి సంబంధించి నందన్ నీలేకని నిరంతరం సందేశాలు పంపుతున్నారు. పన్ను రిటర్నుల కోసం ఏదైనా గడువు పొడిగిస్తే, దాని గురించి మీకు తెలియజేయబడుతుంది అని వెల్లడించారు.

 

ఇవీ కూడా చదవండి

మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే 15 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే పీఎఫ్‌ డబ్బులు ఇరుక్కుపోతాయి!

SBI Lunch Time: మీరు లంచ్‌ టైమ్‌లో బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీ సమయం వృధా కాకుండా ఈ సమయాలను గుర్తించుకోండి