గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన అతను దారి తప్పాడు. తనతో పాటు టూర్ కు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తే.. ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె కిక్కురుమనకుండా ఉండిపోయింది. ఎలాగోలా అతని బారి నుంచి బయటపడిన బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. వారు మొదట షాక్ అయినా.. కీచక ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పేందుకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఆ ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ లోని మీరఠ్ లోని ఓ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ను ప్రిన్సిపల్ టూర్ కు తీసుకువెళ్లాడు. తొమ్మిది మంది విద్యార్థినులతో కలిసి నవంబర్ 23 న బృందావన్‌కు వెళ్లాడు. రాత్రి అక్కడే బస చేసేందుకు సమీపంలోని ఓ హోటల్ లో రెండు గదులను అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మంది విద్యార్థినుల్ని ఒక గదిలో ఉంచాడు. మరో గదిలో 11వ తరగతి చదువుతున్న బాలిక పాటు అతడు ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకుని రూమ్ తీసుకున్నాడు.
ఈ క్రమంలో తనతో కలిసి రూమ్ లో ఉండే విద్యార్థినికి రాత్రి భోజనంలో మత్తు మందు కలిపాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మెలకువ రావడంతో జరుగుతున్న తీరుపై కంగారుపడింది. గట్టిగా అరిచి, ప్రతిఘటించడంతో కీచక ప్రిన్సిపల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆ రాత్రంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. విద్యార్థినులందరూ నవంబర్ 24న ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
బాధితురాలు తొలుత ఈ ఘటనపై మౌనంగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తనపై జరిగిన ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుకు చెప్పిన ఘటనతో తీవ్ర షాక్ కు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ప్రిన్సిపల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..