‘వార్ యోచన ‘బేర్’మంది, టెంట్లు పీకేసి, పాంగాంగ్ లో చైనా సేనల ఖాళీ, ట్రక్కుల్లో తిరుగుముఖం

| Edited By: Anil kumar poka

Feb 16, 2021 | 4:38 PM

లడాఖ్ తూర్పు ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు వద్ద దాదాపు సంవత్సర కాలంగా మోహరించిన చైనా సైనికులు తమ టెంట్లను పీకేసి;;దగ్గరలో ఉన్న ట్రక్కులవద్దకు వెళ్తున్న దృశ్యాలు....

వార్ యోచన బేర్మంది, టెంట్లు పీకేసి, పాంగాంగ్ లో చైనా సేనల ఖాళీ, ట్రక్కుల్లో తిరుగుముఖం
India - China Border Tension
Follow us on

లడాఖ్ తూర్పు ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు వద్ద దాదాపు సంవత్సర కాలంగా మోహరించిన చైనా సైనికులు తమ టెంట్లను పీకేసి;;దగ్గరలో ఉన్న ట్రక్కులవద్దకు వెళ్తున్న దృశ్యాల తాలూకు వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.ఈ సరస్సుకు రెండు వైపులా సాగుతున్న ఉపసంహరణల జోరును ఈ వీడియో ప్రతిబింబిస్తోంది. బంకర్లను ధ్వంసం చేస్తూ.. హెవీ లోడ్ ను ఎత్తయిన ప్రాంతాల నుంచి దిగువకు తీసుకువెళ్తున్న దృశ్యాలు, సైనిక కట్టడాలను తొలగిస్తున్న ఎర్త్ మూవర్లను కూడా ఇందులో చూడవచ్చు. ఇక యుధ్ధ ట్యాంకులు వరస పెట్టి వెనక్కు మళ్లుతున్నాయి. ఈ వారాంతానికి ఇక్కడ ఉపసంహరణలు పూర్తి కావచ్ఛునని భావిస్తున్నారు.

ఈ తొలివిడత ఉపసంహరణ పూర్తి అయ్యాక..హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వంటి చోట్ల కూడా సేనల ఉపసంహరణకు సంబంధించి 48 గంటల్లోగా కోర్స్ కమాండర్ల స్థాయిలో చర్చలు జరగనున్నాయి. ఇక ఇండియా కూడా ఇలాగే తన దళాలను వారివారి స్థానాలకు మళ్ళిస్తోంది. భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు ఇక ఉండబోవని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల తెలిపారు.

మరిన్ని చదవండి :

Indian Navy Jobs With 10th, Inter Qualification Video: పది పాసైతే చాలు ఇండియన్ నేవీలో జాబ్ లు.

మహారాష్ట్రలో మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. మరోసారి లాక్‌డౌన్ దిశగా చెంబూర్‌..?