Maharashtra: మహారాష్ట్రలో రెండు బస్సు ప్రమాదాలు.. మంటలకు దగ్ధమైన రెండు బస్సులు..

మహారాష్ట్రలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండూ ఆర్టీసీ బస్సులే కావడం విశేషం.

Maharashtra: మహారాష్ట్రలో రెండు బస్సు ప్రమాదాలు.. మంటలకు దగ్ధమైన రెండు బస్సులు..
Bus Fire Accident

Updated on: Nov 01, 2022 | 10:10 PM

మహారాష్ట్రలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండూ ఆర్టీసీ బస్సులే కావడం విశేషం. బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో అవి పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి. ఈ ప్రమాదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పుణేలోని ఎరవాడ వద్ద శాస్త్రి నగర్‌ రోడ్డు సమీపంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, బస్సుకు మంటలు అంటుకోవడాన్ని పసిగట్టిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తం అయ్యాడు. ప్రయాణికులను అలర్ట్ చేశాడు. ప్రయాణికులంతా బస్సు నుంచి కిందకు దిగేశారు. దాంతో అంతా సేఫ్ అయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యావత్మాల్ నుంచి చించ్వాడ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇక మరో బస్సు ప్రమాదం అమరావతిలో చోటు చేసుకుంది. అమరావతి – నాగ్‌పూర్ హైవేపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ కూడా డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు అలా దిగారో లేదో.. బస్సు మొత్తం మంటలు అంటుకున్నాయి. మంటల్లో బస్సు బూడిద అయిపోయింది. అయితే, ఈ ప్రమాదం కారణంగా అమరావతి-నాగ్‌పూర్ హైవేపై గంటపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశాయి. ఇక ఈ రెండు ప్రమాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..