Biryani Party: కర్ణాటకలో దారుణం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బిర్యానీ పార్టీలో..

Biryani Party: కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. కొందరు దుండగులు పిల్లలతో బలవంతంగా మద్యం తాపించారు. దీనికి సంబంధించిన..

Biryani Party: కర్ణాటకలో దారుణం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బిర్యానీ పార్టీలో..

Updated on: Jun 10, 2021 | 5:53 AM

Biryani Party: కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. కొందరు దుండగులు పిల్లలతో బలవంతంగా మద్యం తాపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని రామనగర జిల్లా కోడిహల్లి గ్రామంలో గిరీష్, కరియప్పగా వ్యక్తులు పిల్లల కోసం చికెన్ బిర్యానీ పార్టీని ఏర్పాటు చేశారు. పిల్లలు చికెన్ బిర్యానీ తిన్న తరువాత వారిచే బలవంతంగా మద్యం తాగించారు.

దాదాపు ఏడుగురు బాలురతో వీరు బలవంతంగా మద్యం తాగించినట్లు తెలుస్తోంది. అయితే, మద్యం తాగిన చిన్నారులు.. అచేతన స్థితిలో వీడియో తీశారు. తమచే మద్యం తాగించారని ఆరోపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. చివరికి అధికారుల కంట పడింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన అధికారులు.. గిరీష్, కరియప్ప లను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Also read:

Murder: జార్ఖండ్‌లో ఘోరం.. బీజేపీ నాయకుడి కుమార్తె దారుణ హత్య.. కళ్లు పీకేసి, చెట్టుకు ఉరివేసి..