రోడ్డుమీద చిరువ్యాపారులే అని చిన్నచూపు చూడకండి.. వారిలోను కోటీశ్వరులున్నారు.. అక్కడ 250మందికి పైగా కోటీశ్వరులే

|

Jul 20, 2021 | 8:04 PM

Chaat Sellers: రోడ్డుమీద ఛాట్ బండి, బజ్జీలు , అమ్ముతున్నారని ఆ చిరువ్యాపారులను చిన్న చూపు చూడకండి.. ఎందుకంటే వారిలోనూ కోటీశ్వరులున్నారు.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని..

రోడ్డుమీద చిరువ్యాపారులే అని చిన్నచూపు చూడకండి.. వారిలోను కోటీశ్వరులున్నారు.. అక్కడ 250మందికి పైగా కోటీశ్వరులే
Chaat Sellers
Follow us on

Chaat Sellers: రోడ్డుమీద ఛాట్ బండి, బజ్జీలు , అమ్ముతున్నారని ఆ చిరువ్యాపారులను చిన్న చూపు చూడకండి.. ఎందుకంటే వారిలోనూ కోటీశ్వరులున్నారు.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని రహదారిపై చాట్, చాయ్, సమోసా. పాన్ అమ్మే వ్యాపారం చేస్తున్నవారిలో లక్షాధికారులున్నారని వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాన్పూర్ లో ఒకరు కాదు. ఇద్దరు కాదు ఏకంగా 250మందికి పైగా లక్షాధికారులున్నాని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ లక్షాధికారులల్లో ఎక్కువమంది పేదవారిగా పరిగణింపబడుతున్న చిన్న కిరాణా దుకాణ యజమానులు, టీ , సమోసా, చాట్ అమ్ముకునేవారు అని.. వీరి సంపాదన రసాయన శాస్త్రవేత్తల కంటే ఎక్కువ అని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో కొంతమంది పండ్లని విక్రయించేవారున్నారని.. వారికీ ఏకంగా వందల ఎకరాల సాగు భూమి ఉందని.. ఈ భూమి యజమాములు పన్నులు కట్టడం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కాలంలో లక్షలు జీతం సంధించుకునేవారు కూడా ఆర్ధిక ఇబ్బందులను, EMI చెల్లించడంలో సమస్యను ఎదుర్కొన్నారు. కాని కాన్పూర్ లో మాత్రం స్క్రాప్ డీలర్లకు కూడా మూడు కార్లు ఉన్నాయి. అయితే ఇంతటి ధనవంతులు కూడా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించరు. జీఎస్టీతో ఎటువంటి సంబంధం లేదు. నగరంలోని లాల్‌బంగ్లా ప్రాంతంలో ఒకరికి, బెకోంగంజ్‌లోని ఇద్దరు స్క్రాప్ డీలర్లు రెండేళ్లలో రూ .10 కోట్లకు పైగా విలువైన మూడు ఆస్తులను కొనుగోలు చేశారు. పేదలుగా కనిపించే ఈ ‘ధనవంతులుపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది.

ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది చిరు వ్యాపారాలు కోటీశ్వరులున్నాయని తెలిసింది. డేటా సాఫ్ట్‌వేర్ , ఇతర సాంకేతిక విధానాలతో ఈ వ్యాపారుల వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు షాక్ తిన్నారు. ఈ వ్యాపారస్థులు ఒక్క పైసా జీఎస్టీ చెల్లించలేదు.. కాని నాలుగేళ్లలో రూ. 375 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారు.

ఆర్యనగర్‌లో పాన్ షాపులోని ఇద్దరు యజమానులు కరోనావైరస్ కాలంలో రూ .5 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు. ఇక మరోవైపు మాల్‌రోడ్‌కు చెందిన పల్లీలు అమ్ముకునే వ్యాపారి.. ప్రతి నెల వివిధ బండ్లపై రూ .1.25 లక్షలు అద్దెకు చెల్లిస్తున్నాడు. మరోవైపు, స్వరూప్ నగర్, హులగంజ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు భవనాలను కొనుగోలు చేయగా చాట్ అమ్మకందారులు భూమిపై భారీగా పెట్టుబడి పెట్టారు. మొత్తానికి కాన్పూర్ లోని కోట్లాది రూపాయలను సంపాదిస్తున్న చిరు వ్యాపారుల సంపాదన శాస్త్రవేత్తల సంపాదన కంటే 65 శాతం ఎక్కువ. అయితే తమ సంపదన గురించి ప్రభుత్వం కన్ను కప్పడానికి కొంతమంది సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక పథకాలను ఆశ్రయించగా .. మరికొందరు తమ ఫ్యామిలీ సభ్యుల పేరుతో ఆస్తులను కొన్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు లు ద్వారా ఈ ఆస్తుల చిట్టా రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: కోవిడ్ వాక్సిన్ ఫస్ట్‌ డోస్ తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు