Shocking Love Story: భర్తతో కలిసి జాతరకు వెళ్లిన భార్య మిస్సింగ్.. ఆ తరువాత మ్యాటర్ తెలిసి ఫ్యూజుల్ ఔట్..!

Love Story: పాపం ఆ భర్త సరదాగా తన భార్యను బయటకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంకేముంది ఆ సమయం రానే వచ్చింది. సమీప ప్రాంతంలో జరుగుతున్న జాతరకు భార్యతో కలిసి వెళ్లాడు.

Shocking Love Story: భర్తతో కలిసి జాతరకు వెళ్లిన భార్య మిస్సింగ్.. ఆ తరువాత మ్యాటర్ తెలిసి ఫ్యూజుల్ ఔట్..!
Woman

Updated on: Apr 14, 2022 | 6:17 AM

Love Story: పాపం ఆ భర్త సరదాగా తన భార్యను బయటకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంకేముంది ఆ సమయం రానే వచ్చింది. సమీప ప్రాంతంలో జరుగుతున్న జాతరకు భార్యతో కలిసి వెళ్లాడు. కానీ, భర్త ఔటింగ్ ప్లాన్ వేస్తే.. దాన్ని అదునుగా చేసుకుని అతని భార్య జంపింగ్ ప్లాన్ వేసుకుంది. అవును.. భర్తతో కలిసి జాతరకు వెళ్లిన భార్య మధ్యలోనే మిస్ అయ్యింది. దాంతో తన భార్య తప్పిపోయిందని భావించిన భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. కానీ, అసలు విషయం పోలీసుల విచారణలో తేలడంతో అతను ఖంగుతిన్నాడు. తన భార్య మిస్ అవలేదని, ప్రియుడితో జంప్ అయ్యిందని తెలుసుకుని అవాక్కయ్యాడు. ఈ ఘటన బిహార్‌లోని బంకా జిల్లాలో వెలుగుచూసింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ఆ మహిళకు ఒక బిడ్డ కూడా ఉంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంకా జిల్లాలోని బధౌనా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి ఢాకా మోడ్ ఫెయిర్ చూసేందుకు వచ్చారు. అయితే, అక్కడ వ్యక్తి భార్య కనిపించకుండాపోయింది. ఈ విషయమై మరుసటిరోజు సాయంత్రం మహిళ భర్త బరాహత్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తన భార్య కనిపించడం లేదని ఆరోపించాడు. అయితే, తన భార్య కనిపించకపోవడానికి తన గ్రామానికే చెందిన పంకజ్ ఝా కారణమని ఆరోపించాడు. భర్త ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఢాకా మోడ్ ఫెయిర్‌కు వెళ్లిన మహిళకు తన ప్రియుడు అయిన పంకజ్ ఝా కారులో కనిపించాడట. అతన్ని చూడగానే సంబరపడిపోయిన మహిళ.. అతనితో కలిసి వెళ్లిపోయినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు.

Also read:

G7 Summit – India: G7 సమ్మిట్‌కు భారత్‌కు ఆహ్వానం.. ఒక్క ప్రకటనతో ఆ ప్రచారానికి చెక్ పెట్టి జర్మనీ..!

Telangana Congress: రాజ్‌భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. ఇది ప్రస్తుతానికేనా? ఎప్పటికీ ఉంటుందా?

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. ఏకంగా సీఈవో పైనే దాడికి దిగిన సిబ్బంది..!