Uttarakhand Rains: దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా ఉత్తరాఖండ్‌లో (అక్టోబర్ 18) రేపటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా అక్టోబర్ 18 న సెలవు ప్రకటించింది. ఉత్తరాఖండ్ సర్కారు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు రెడీగా ఉండాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఇక భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో బద్రీనాథ్ యాత్రకు బ్రేక్ నిచ్చారు చమోలీ జిల్లా అధికారులు. అంతేకాదు యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. జోషి మఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల్లో యాత్రికులు బస చేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ కుమార్ చెప్పారు. కొంతమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: తమ ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టిందని అదనపు పెట్రోల్ ఉచితంగా ఇచ్చిన ఓ వ్యక్తి ఎక్కడంటే..