IMA writes to PM Narendra Modi: దేశంలో ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. రోగులకు ఏమన్నా జరిగితే.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బాధితుల కుటుంబ సభ్యులు దాడులకు పూనుకుంటున్నారు. దీంతోపాటు ఇటీవల బాబా రాందేవ్ అల్లోపతి వైద్యంపై పలు కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐఎంఏ సోమవారం ప్రధానికి లేఖ రాసింది. వైద్యులపై నిరంతరం కొనసాగుతున్న శారీరక, మానసిక దాడిని.. అలాగే స్వార్థ ప్రయోజనాలున్న కొంత మంది వ్యక్తులు ఆధునిక వైద్యం, వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ జోక్యం అవసరమని ఐఎంఏ అభిప్రాయపడింది.
కోవిడ్ మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తున్నారని ఐఎంఏ పేర్కొంది. ఈ పోరాటంలో.. 1400 మంది వైద్యులు ప్రాణాలకు కోల్పోయారని వెల్లడించింది. ఈ క్రమంలో ఆధునిక వైద్యం అల్లోపతి, అదేవిధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఏ వ్యక్తి అయినా.. అంటువ్యాధుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇటీవల అసోంలో కోవిడ్ కేర్ సెంటర్‌లో ఓ యువ వైద్యుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అలాగే బాబా రాందేవ్ అల్లోపతి వైద్యంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఐఎంఏ ఖండించింది. దీంతోపాటు మరలా బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కు జూన్ 1న వైద్యులు బ్లాక్ డేగా పాటించారు. లేకపోతే జూన్ 18న పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని ఐఎంఏ తెలియజేసింది.
Indian Medical Association (IMA) writes to Prime Minister Narendra Modi, requesting his personal intervention to resolve IMA’s pleas & to ensure “optimum milieu” for medical professionals to work without fear pic.twitter.com/tLK0OjhFzE
— ANI (@ANI) June 7, 2021
Also Read: