ima letter to pm modi : యోగాగురు బాబా రాందేవ్ బాబా తప్పుడు ప్రచారాన్ని ఆపండి.. ప్రధాని మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ

వ్యాక్సినేషన్లపైనా, వైద్యులపైనా బాబారాందేవ్ బాబా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీని కోరింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాస్తూ..

ima letter to pm modi : యోగాగురు బాబా రాందేవ్ బాబా తప్పుడు ప్రచారాన్ని ఆపండి.. ప్రధాని మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ
Ima Appeals Pm Modito Stop Ramdevbaba's Misinformation

Edited By: Anil kumar poka

Updated on: May 26, 2021 | 7:48 PM

వ్యాక్సినేషన్లపైనా, వైద్యులపైనా బాబారాందేవ్ బాబా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీని కోరింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాస్తూ.. దేశద్రోహం కింద ఆయనపై తగిన చర్య తీసుకోవాలని కోరింది. కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ 10 వేలమంది డాక్టర్లు మరణించారని, అలోపతి మందులవల్ల లక్షల మంది మరణించారని ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అయన కామెంట్స్ తమనెంతో బాధించాయని ఈ సంస్థ సభ్యులు పేర్కొన్నారు. 18 ఏళ్ళు పైబడినవారికందరికీ వ్యాక్సిన్ వేయించాలని మీరు పిలుపునిచ్చారు.. మీ సూచనతో మొట్టమొదటగా దేశ వ్యాప్తంగా మేం ఈ ప్రయత్నంలో పాలు పంచుకున్నాం అని వారు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ని ఐసీఎంఆర్ ద్వారా గానీ, నేషనల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గానీ మెడికల్ ప్రొఫెషనల్స్ అంతా పాటిస్తున్నారని ఐఎంఏ స్పష్టం చేసింది. అలోపతి మందులవల్లే ప్రజలు మరణిస్తున్నారని అయన (బాబా రాందేవ్) అంటే ఈ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను సవాలు చేసినట్టే అవుతుంది అని కూడా ఈ సంస్థ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఉత్తరాఖండ్ ఐఎంఏ కూడా ఇలాగే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బాబా రాందేవ్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేస్తామంటూ ఆయనకు నోటీసు జారీ చేసింది. లిఖితపూర్వకంగా 15 రోజుల్లోగా సారీ చెప్పాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఈ పరిణామాలపై బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).

Corona Virus: 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్… చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల.. ( వీడియో )
Viral Video: వినూత్నంగా ఆకాశం లో ఎగురుతూ పెళ్లి… ఆతర్వాత ఏమైందో తెలిసి షాక్ లో కుటుంబ సభ్యులు.. ( వీడియో )