ఆదివాసీ విద్యార్థులకు రూ.10 ట్యూషన్.. ఉచితంగా పుస్తకాలు.. ఔదార్యం చాటుతున్న దంపతులు

|

Dec 03, 2020 | 9:52 AM

అర్థికంగా చితకిపోయిన బతుకులకు ఆ జంట ఆసరా కావాలనుకుంది. ఎంతోకొంత సాయం చేసి ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలను ఆదకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఐటీ దంపతుల జంట ముందుకు వచ్చింది.

ఆదివాసీ విద్యార్థులకు రూ.10 ట్యూషన్.. ఉచితంగా పుస్తకాలు.. ఔదార్యం చాటుతున్న దంపతులు
Follow us on

అర్థికంగా చితకిపోయిన బతుకులకు ఆ జంట ఆసరా కావాలనుకుంది. ఎంతోకొంత సాయం చేసి ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలను ఆదకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఐటీ దంపతుల జంట ముందుకు వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో తేయాకు తోటలు అధికంగా ఉండే ఉత్తర ప్రాంతంలో ఆదివాసీలు అధికంగా ఉంటారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో వీరు దుర్భర జీవితం సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తేయాకు తోటల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో తేయాకు తోటల్లో పనిచేసేవారి ఉపాధి కరువైంది. మరోవైపు, లాక్‌డౌన్‌తో మూతపడ్డ పాఠశాలలు ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు నడుస్తుండటంతో పిల్లలు చదువుకునేందుకు స్మార్ట్‌‌ఫోన్లు లేక పిల్లలు చదువుసంధ్యలకు దూరమయ్యారు.

అయితే ఈ ప్రాంతంలోని ప్రజల పరిస్థితులను గమనించిన ఐఐటీ దంపతుల జంట వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉన్న నివర్ణ్ నందీ, అదే యూనివర్సిటీలో సోషల్ సైన్స్, ఎకానమీలో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్న పాల్మి చాకీ నందీ… ఆదివాసీయులకు తమవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అ కాలేజీ క్లాసులు నడవకపోవడంతోవీరు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దంపతులు గ్రామంలోని పిల్లలకు పది రూపాయలకే ట్యూషన్లు చెప్పడంతోపాటు, మొబైల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలను అద్దెకు ఇస్తున్నారు.

నందీ దంపతులు వారంలో రెండు లేదా మూడుసార్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి మహిళలు, యువతులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని మహిళలకు ఉచితంగా శానిటర్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ ఐఐటీ దంపతుల మహత్తర కార్యక్రమం కారణంగా 25 గ్రామాలు, 20 టీ తోటల్లోని 1,800 మంది చిన్నారులకు లబ్ధి చేకూరింది. ఈ చిన్నారులలో 80 శాతం మంది బాలికలే ఉన్నారు. ఈ సందర్భంగా పాల్మి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఈ విషయం తెలుసుకున్న తాము వారికి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకూ సుమారు 22 వేల శానిటరీ ప్యాడ్స్ అందించామని తెలిపారు. ఇదేవిధంగా ఈ ప్రాంతంలోని చిన్నారులకు వివిధ సబ్జెక్టులలో ట్యూషన్ చెప్పాలని నిర్ణయించుకున్నామని, ఉచితంగా ట్యూషన్ చెబుతామంటే ఎవరూ రావడం లేదని, అందుకే కేవలం 10 రూపాయల ఫీజుతో వారికి ట్యూషన్లు చెబుతున్నామని తెలిపారు. ఈ ట్యూషన్లకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. ఈ దంపతుల ఔదార్యాన్ని తెలుసుకున్నవారంతా వారిని అభినందలతో ముంచెత్తుతున్నారు.