
బార్డర్‌లో బాంబులు పేల్చుకుంటే.. తమకేమవుతుందిలే అనుకుంటారు చాలామంది. బట్.. ఒక యుద్ధం ఆ దేశ కుగ్రామంలోని ప్రజలపైనా ప్రభావం చూపిస్తుంది. తెలుసా..! గత పాతికేళ్లుగా భారత్ యుద్ధం చేయలేదు కాబట్టి ఆ విషయం మరిచిపోయి ఉంటారు. బట్.. కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలిక్కడ. 1971లో యుద్ధం జరిగినప్పటి పరిస్థితులను కూడా మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇకపై రాబోయే యుద్ధం, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ ఓ అవగాహన వస్తుంది. ఆ అవగాహనకే ఈ స్టోరీ. యుద్ధం యుద్ధం అని తెగ కోరుకుంటున్నారు కొందరు. కాని, యుద్ధం ఆషామాషీ వ్యవహారమేం కాదు. యుద్ధం అంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సిన ఓ అంతిమ పరిష్కారం. పైగా యుద్ధం ఊహకందని ఓ ఆర్థిక భారం కూడా. ఈ సందర్భంగా 1990 నాటి ఓ ఇంట్రస్టింగ్ మ్యాటర్ చెప్పుకోవాలి. CIA- సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఒకటుంది. అమెరికాకు చెందిన నిఘా సంస్థ ఇది. ప్రపంచ దేశాల్లో ఎక్కడేం జరుగుతోందన్న దానిపై ఓ కన్నేసి ఉంచడం ఈ సీఐఏ మెయిన్ డ్యూటీ. ఆ సీఐఏ.. 1990లో ఓ రిపోర్ట్ తయారు చేసి అమెరికా ఉన్నతాధికారులకు పంపింది. ఆ నివేదికలో.. పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయాలనుకుంటోంది అని రాసుకుంది. సుమారు వెయ్యి గంటల పాటు యుద్ధం చేయాల్సి వస్తే.. అంటే 41 రోజుల పాటు యుద్ధం చేస్తే.. ఎంత ఖర్చు అవుతుందనేది లెక్కలేసి పెట్టుకుంది...