Corona: ఒక్కరికి కరోనా వస్తే.. 27 మందికి వచ్చినట్టే.! ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్‌ నిజాలు..

|

May 24, 2021 | 12:49 PM

దేశంలో ఇప్పటివరకు 24.1 శాతం మందికి కరోనా సోకినట్టు ఐసీఎంఆర్ చేపట్టిన సెరో సర్వే వెల్లడైంది. ఈ సర్వేను ఐసీఎంఆర్ డిసెంబరు 2020 నుంచి..

Corona: ఒక్కరికి కరోనా వస్తే.. 27 మందికి వచ్చినట్టే.! ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్‌ నిజాలు..
Corona Cases Inindia
Follow us on

దేశంలో ఇప్పటివరకు 24.1 శాతం మందికి కరోనా సోకినట్టు ఐసీఎంఆర్ చేపట్టిన సెరో సర్వే వెల్లడైంది. ఈ సర్వేను ఐసీఎంఆర్ డిసెంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య కాలంలో నిర్వహించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసి 70 జిల్లాల్లో కేసుల సరళిని పరిశీలించింది. అందులో భాగంగా ఒక్క కరోనా కేసు గుర్తిస్తే.. 27 మందికి వైరస్ సోకినట్టేనని ఐసీఎంఆర్ పేర్కొంది.

పదేళ్లకు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని ఈ సర్వే వెల్లడించింది. పదేళ్లకు పైబడిన వారిలో కనీసం నాలుగువందల మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ నిర్ధారణకు ఐసీఎంఆర్ వచ్చింది. అలాగే 25.6 శాతం ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడినట్టు తెలిపింది. ఆరోగ్య సిబ్బందిలో వందమంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్నారని సర్వేలో తేలింది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!