ఐసీఐసీఐ మొబైల్ యాప్‏లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి..

|

Dec 08, 2020 | 8:21 AM

ఐసీఐసీఐ బ్యాంకు తమ మొబైల్ పే యాప్‏‏లో కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా తమ ఐమొబైల్ పే ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది.

ఐసీఐసీఐ మొబైల్ యాప్‏లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి..
Follow us on

ఐసీఐసీఐ బ్యాంకు తమ మొబైల్ పే యాప్‏‏లో కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా తమ ఐమొబైల్ పే ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. ఇప్పటివరకు ఈ యాప్ ‘Imobile’ పేరుతో అందుబాటులో ఉంది. కొత్తగా తీసుకువచ్చిన మార్పులకు అనుగుణంగా దీనిని I mobile Payగా మార్చారు. ఈ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల వినియోగదారులు తమ సొంత UPI  IDని నమోదు చేసుకొని, దాంతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్‏తో లావాదేవీలు చేసుకోవచ్చు.

ఇలాంటి యాప్ రావడం ఇదే మొదటిసారని ఐసీఐసీఐ తెలిపింది. కస్టమర్లు తమ కాంటాక్టులకు సంబంధించిన యూపీఐ ఐడీలను ఎక్కువకాలం గుర్తుంచుకోనవసరం లేకుండా ఇంటర్ఆపరబిలిటీని అందిస్తున్నామని తెలిపింది. దీంతో సులభంగా పేమెంట్ యాప్స్, వాలెట్లకు మనీ ట్రాన్స్‏ఫర్ చేసుకోవచ్చని పేర్కోంది.

“సరికొత్త ఆవిష్కరణలు చేయడం, వాటిని అమలుపరచడంలో మేమెప్పుడూ ముందుంటాం. 2008లో దేశంలోనే మొదటిసారిగా బ్యాంకింగ్ యాప్‏ను పరిచయం చేశాం. ఇప్పుడు విడుదల చేసిన కొత్త వెర్షన్‏తో ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా వారు బ్యాంకు అకౌంట్లను ఇందులో లింక్ చేసుకోవచ్చు” అని ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.