IAS Officers Divorce: వారిద్దరూ ఐఏఎస్ టాపర్లు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఇప్పుడు

|

Aug 11, 2021 | 12:48 PM

Tina Dabi, Athar Khan divorce: వారిద్దరూ ఐఏఎస్ 2015 బ్యాచ్ టాపర్లు.. మతాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో

IAS Officers Divorce: వారిద్దరూ ఐఏఎస్ టాపర్లు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఇప్పుడు
Tina Dabi Athar Aamir Khan
Follow us on

Tina Dabi, Athar Khan divorce: వారిద్దరూ ఐఏఎస్ 2015 బ్యాచ్ టాపర్లు.. మతాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్‌చేస్తే ఇప్పుడు ఆ జంట విడాకులు తీసుకుని.. దేశవ్యాప్తంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. వారే ఐఏఎస్‌లు టీనా దాబి, అథార్ అమిర్ ఖాన్‌. తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఇష్టపూర్వకంగా ఇద్దరూ గతేడాది నవంబర్‌లో విడాకుల కోసం.. దరఖాస్తు చేసుకోగా జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు ఓకే చెప్పింది.

రాజస్తాన్‌కు చెందిన టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించి సంచలనం సృష్టించింది. అదే ఏడాది జమ్మూకాశ్మీర్‌కు చెందిన అథార్‌ అమిర్ ఖాన్‌ రెండో ర్యాంక్‌ సాధించాడు. అయితే.. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐఏఎస్ అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయినా వారు వెనకడుగు వేయకుండా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు హాజరై అభినందించి ప్రశంసించారు. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించిన ఈ జంట.. ఏమైందో ఏమోగానీ విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ మంగళవారం విడాకులు మంజూరు చేసింది. మెరుగైన పాలన అందిస్తూ అందరి నోళ్లల్లో నానిన టినా దాడి, అథార్ అమిర్ ఖాన్.. విడాకులు తీసుకోవడం గమనార్హం. అన్ని చోట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ జంట.. తాజాగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Venkaiah Naidu: సభ పవిత్రతను నీరుగార్చారు.. రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Viral News: నీరజ్ భాయ్‌కి గోల్డెన్ పాస్ ఇవ్వడం కాదు.. లోకల్ అథ్లెట్లను ఆదుకోండి.. కేఎస్ఆర్‌టీసీ ఆఫర్‌పై నెటిజన్ల ట్రోల్స్..!