ఆరేళ్లకే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న జిల్లా కలెక్టర్

Divya S Iyer IAS: తాను కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ జిల్లా కలెక్టర్.

ఆరేళ్లకే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న జిల్లా కలెక్టర్
Divya Iyer
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 30, 2023 | 11:01 AM

తాను కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ జిల్లా కలెక్టర్. ఆరేళ్ల వయసున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిణి తెలిపారు. దీంతో పసితనంలోనే ఎంతో మానసిక క్షోభను అనుభవించానని.. తన జీవితంలోని చీకటి రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్‌.అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను ఆప్యాయంగా దగ్గరకు పిలిచారని.. దగ్గరకు వెళ్లిన తనతో ఆప్యాయంగా మాట్లాడుతూనే.. తాకరాని చోట తాకుతూ.. బట్టలు విప్పేశారన్నారు. చివరికి ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయనన్నారు. తల్లిదండ్రుల సహకారంతో ఆ బాధ నుంచి విముక్తి పొందానన్నారు. వారి ముఖాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయంటూ తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు కలెక్టర్. అందుకే తల్లిదండ్రులు చిన్నపుడే ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివ్య సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.