PM Modi: పుట్టినరోజు నాడు అమ్మ దగ్గరికి వెళ్లకుండా.. మిమ్మల్ని కలిసేందుకే వచ్చా.. ప్రధాని మోడీ భావోద్వేగం

|

Sep 17, 2022 | 5:48 PM

PM Narendra Modi in Sheopur: పుట్టినరోజు నాడు.. అమ్మ దగ్గరకు వెళ్లలేదని.. మిమ్మల్ని కలిసేందుకు వచ్చానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు.

PM Modi: పుట్టినరోజు నాడు అమ్మ దగ్గరికి వెళ్లకుండా.. మిమ్మల్ని కలిసేందుకే వచ్చా.. ప్రధాని మోడీ భావోద్వేగం
Pm Modi
Follow us on

PM Narendra Modi in Sheopur: పుట్టినరోజు నాడు.. అమ్మ దగ్గరకు వెళ్లలేదని.. మిమ్మల్ని కలిసేందుకు వచ్చానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో షియోపూర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. కునో నేషనల్‌ పార్క్‌లో చీతాలను వదిలిపెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా 8 చిరుత పులులను నేషనల్‌ పార్క్‌లో వదిలారు. అనంతరం కునో నేషనల్‌ పార్క్‌ని పరిశీలించి జంతువుల సంరక్షణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత కరాహల్‌లో జరిగిన మహిళా సంఘాల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈసారి తన జన్మదినాన్ని తల్లితో జరుపుకోవాలని అనుకున్నానని, కాని మీతో జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. మహిళల ప్రాతినిధ్యం పెరిగిన రంగంలో, విజయం స్వయంచాలకంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి స్వచ్ఛ్ భారత్ అభియాన్‌నే ఉదాహరణ అని పేర్కొన్నారు. మహిళలే దీని విజయానికి అతిపెద్ద కారణమని అన్నారు. తన పుట్టినరోజున ఎప్పుడూ తన తల్లి వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తానని.. అయితే ఈసారి షియోపూర్‌లోని తల్లుల వద్దకు వచ్చానంటూ పేర్కొన్నారు. గత శతాబ్దపు కాలంలో మహిళా శక్తి ప్రాతినిధ్యం పెరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఇలా లేదని పేర్కొన్నారు. నేటి నవ భారతంలో పంచాయతీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మహిళాశక్తి జెండా రెపరెపలాడుతోందంటూ అభివర్ణించారు. దేశంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు చాలా ప్రోత్సాహం ఇస్తునట్టు తెలిపారు మోదీ. స్కూళ్లలో 5000 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించిన అనంతరం దేశప్రజలకు విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ జయంతి రోజున స్వయం సహాయక సంఘాల కార్యక్రమంలో మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం చాలా ప్రత్యేకమైన పరిణామమని ప్రధాని మోడీ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

ముందుగా.. షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోడీ 75 ఏళ్ల తర్వాత చిరుతలు భారత గడ్డపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను వదిలే అవకాశం తన లభించడం చాలా సంతోషకరమైన విషయమంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..