వారంలోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్..నో డౌట్ !

|

Jul 03, 2019 | 4:01 PM

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ గత మే 25 నే రాజీనామా చేశారు. దీన్ని ఉపసంహరించుకోవాలని సీనియర్ నేతలతో సహా… ఎంతమంది, ఎన్నిరకాలుగా కోరినా ఆయన ఇందుకు నిరాకరిస్తూ వచ్చారు. చివరకు బుధవారం మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించి.. ఇక నా నిర్ణయం ఫైనల్ అని ప్రకటించారు. దీంతో…. పార్టీకి వారంలోగా నూతన అధ్యక్షుని ఎంపిక ఖాయమని, ఇందులో అనుమానం లేదని పార్టీ […]

వారంలోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్..నో డౌట్ !
Follow us on

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ గత మే 25 నే రాజీనామా చేశారు. దీన్ని ఉపసంహరించుకోవాలని సీనియర్ నేతలతో సహా… ఎంతమంది, ఎన్నిరకాలుగా కోరినా ఆయన ఇందుకు నిరాకరిస్తూ వచ్చారు. చివరకు బుధవారం మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించి.. ఇక నా నిర్ణయం ఫైనల్ అని ప్రకటించారు. దీంతో…. పార్టీకి వారంలోగా నూతన అధ్యక్షుని ఎంపిక ఖాయమని, ఇందులో అనుమానం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ తన రాజీనామాను వెనక్కి తీసుకోబోరని స్పష్టం చేశాయి. పార్టీ త్వరలో..మరింత ఆలస్యం కాకుండా కొత్త చీఫ్ ను ఎన్నుకోవాలని రాహుల్ కోరారు. ఈ ఎంపికలో తన ప్రమేయం ఉండదని, ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సాధ్యమైనంత త్వరలో సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరుతున్నట్టు రాహుల్ చెప్పారు. రాహుల్ రాజీనామాతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ శాఖల అధ్యక్షులు రాజీనామాలు చేశారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి, ఏపీలో రఘువీరా రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం గమనార్హం. అయితే కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు వంటి బృహత్తర పనులు చాలానే ఉన్నాయి. ఇందుకు అధ్యక్ష హోదాలో కొత్త నేత ఎవరైనా కృషి చేసే అవకాశం ఉందా.. ? ఆ నేత ఇందుకు ఎలా ప్రయత్నిస్తాడన్నది, గ్రూపులు కట్టినవారిని ఎలా ఏకం చేస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.