Asaduddin Owaisi’s House attacked: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద ఉన్న నేమ్ బోర్డులు, ట్యూబ్ లైట్స్, పూలకుండిలను ద్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఓవైసీ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎంపీ అధికారిక నివాసంపై ఈ దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఈ దాడికి పాల్పడిన ఐదుగురు అల్లరి మూకలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
మంగళవారం ఢిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లీమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై దుండగులు దాడి చేశారు. మొత్తం 8మంది దుండగులు ఈ దాడి చేసేందుకు వచ్చినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు, దాడిపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఎంపీ అధికారిక నివాసంపైనే దాడి చేస్తారా…? దీనికి బీజేపీ ఎం చెప్తుందని ఆయన ప్రశ్నించారు.
एक सांसद के घर पर हमला होता है दिल्ली में, @BJP4India हुकूमत देश को क्या पैग़ाम देना चाहती है? #radicalisation pic.twitter.com/CIOmGL2ylL
— Asaduddin Owaisi (@asadowaisi) September 21, 2021
దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే నిందితులపై సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 427, 188 మరియు పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం నిరోధక చట్టం సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.
आज कुछ उग्रवादी गुंडों ने मेरे दिल्ली के मकान पर तोड़-फोड़ की।इनकी बुज़दिली के चर्चे तो वैसे ही आम हैं।हमेशा की तरह, इनकी वीरता सिर्फ़ झुंड में ही दिखाई देती है।वक्त भी ऐसा चुना जब मैं घर पर नहीं था। गुंडों के हाथों में कुल्हाड़ियाँ और लकड़ियाँ थीं, घर पर पत्थर बाज़ी की गयी। 1/n pic.twitter.com/bwIAdnt43S
— Asaduddin Owaisi (@asadowaisi) September 21, 2021
Read Also… Earthquake in Australia: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం.. కంపించిపోయి మెల్‌బోర్న్.. కుప్పకూలిన భవనాలు..
Crime News: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసిన భార్య