ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని కంకేర్ కు చెందిన తులసీదాస్ మానిక్పురి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2009లో మొదటి వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయాడు. 2014లో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. 2021లో అతనికి ఇంద్రాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిరచయం కాస్తా ప్రేమ(Love) గా మారింది. ప్రేమ మైకంలో మునిగిపోయిన తులసీదాస్ రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి (Marriage) చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య తులసీదాస్ తో గొడవ పడింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని భావించిన తులసీదాస్ ఆమెను చంపేయాలని ప్రణాళిక రచించాడు. మూడో భార్యతో కలిసి పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంద్రాణి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని బరోడా నుంచి కోక్డికి సఫారీ వాహనంలో తీసుకెళ్లారు. డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించి, మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ఈ ఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తులసీదాస్ ను పట్టుకున్నారు. మూడో భార్యతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధరించారు.
తులసీదాస్ మార్క్‌ఫెడ్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడని, లొకేషన్‌ను మార్చుకుంటూ కనిపించకుండా పోయాడని వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు రాయ్‌పుర్, బాలోద్, కవార్దా, దుర్గ్ జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామన్నారు. అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. అతడి మూడో భార్య ఇంద్రాణిని రాయ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
Also ReadKRK on RRR: ఆర్ఆర్ఆర్ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్