సమోసాలు తేవాలంటూ భర్తను బయటకు పంపించిన భార్య.. వచ్చేసరికి ఆమె అలా కనిపించడంతో.. చివరకు..

|

Jun 10, 2024 | 1:52 PM

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు.. ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది. అనంతరం భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. భర్త సమోసాలతో తిరిగి వచ్చేసరికే భార్య మృతదేహం వేలాడుతూ కనిపించింది.. భార్య మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమోసాలు తేవాలంటూ భర్తను బయటకు పంపించిన భార్య.. వచ్చేసరికి ఆమె అలా కనిపించడంతో.. చివరకు..
Samosas
Follow us on

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు.. ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది. అనంతరం భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. భర్త సమోసాలతో తిరిగి వచ్చేసరికే భార్య మృతదేహం వేలాడుతూ కనిపించింది.. భార్య మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటుచేసుకుంది.. చనిపోయే ముందు, భర్త తన మామకు కూడా ఫోన్ చేసాడు. నా భార్య ఆత్మహత్య చేసుకుందని.. ఇక తాను జీవించి ఏమి చేస్తాను? నేను కూడా చావబోతున్నాను. అంటూ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటన బెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా ఖాజీ తోలా సౌత్‌లో జరిగింది.. ఇక్కడ నివసించే 21 ఏళ్ల ఛోటూకు ఫరూఖాబాద్‌లోని రాజీపూర్‌ గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలితో ఆరు నెలల క్రితం వివాహమైంది. వారిద్దరూ 4 డిసెంబర్ 2023న వివాహం చేసుకున్నారు. ఛోటూ దొంగతనాలకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. కష్టపడి డబ్బు సంపాదించాలని అంజలి ఎప్పుడూ తన భర్తకు చెబుతుండేది. ఏదో ఒక రోజు దొంగతనం చేస్తూ పట్టుబడితే పోలీసులు తనపై కూడా చర్యలు తీసుకుంటారని.. వాదించేది.. అయినా ఛోటూ ఎప్పుడూ భార్య మాటలను పట్టించుకోలేదు.

సమోసాలు తీసుకురావడానికి భర్తను పంపించి..

ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. జూన్ 9వ తేదీ తెల్లవారుజామున ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత భార్య అంజలి సమోసా తీసుకురావాలని భర్త ఛోటూను కోరింది. భర్త సమోసాతో ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసి రోదించాడు.. తన భార్య మృతదేహాన్ని కిందకు దించి (మృతురాలి తండ్రి) మామకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ‘‘మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నేను సజీవంగా ఉండి ఏమి చేస్తాను? నేను కూడా చావబోతున్నాను. ’’ అంటూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ ఘటన సమయంలో ఇంట్లో తల్లి, సోదరి ఎవరూ లేరు. తర్వాత ఛోటూ మామ.. అతని తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా టెన్షన్ పడింది. ఛోటూ సోదరి, తల్లి వెంటనే ఇంటికి చేరుకుని.. చూడగా.. ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..