బట్టలు విప్పి.. వాతలు పెట్టి.. తలకిందులుగా వేలాడదీసి.. అనాథ పిల్లలపై ఆశ్రమ సిబ్బంది అకృత్యాలు

|

Jan 20, 2024 | 9:12 AM

ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ ముందు 21 మంది చిన్నారులు తమ గోడు వెల్లబోసుకున్నారు.. దీంతో అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భయానక హింసకు సంబంధించి ఐదుగురు ఆశ్రమ సిబ్బందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విస్తృతమైన దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఇకపోతే, ఆశ్రమాన్ని సీల్‌ చేశామని, పిల్లలను ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని

బట్టలు విప్పి.. వాతలు పెట్టి.. తలకిందులుగా వేలాడదీసి.. అనాథ పిల్లలపై ఆశ్రమ సిబ్బంది అకృత్యాలు
Child Abuse
Follow us on

అదోక అనాథాశ్రమం..దిక్కులేని చిన్నారులు ఆదరించి అక్కున చేర్చుకునే అమ్మ ఒడిలాంటి ఆవాసం అది.. కానీ, అక్కడ జరుగుతున్న దారుణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. జనవరి 12న ప్రభుత్వ బృందం అక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు నుండి 14 ఏళ్ల వయసున్న అన్నాథ పిల్లలపై జరుగుతున్న చిత్రహింసల కథలు బయటపడ్డాయి. చిన్నారులను తలక్రిందులుగా వేలాడదీయడం, వేడి ఇనుముతో వాతలు పెట్టడం, బట్టలు విప్పించి ఫోటో తీయడం, మిర్చిని కాల్చడం ద్వారా వచ్చే పొగను బలవంతంగా పీల్చేలా చేయడం వంటివి చేస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, ఆశ్రమ సిబ్బంది పలు విధాలుగా హింస పెడుతున్నారని, చిన్న తప్పులకే చిత్రహింసలు పెడుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధిత చిన్నారులు అధికారుల వద్ద విలపిస్తూ చెప్పారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.

ఇండోర్‌లోని వాత్సల్యపురం జైన్‌ ట్రస్టు నిర్వహిస్తున్న ఆశ్రమంపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ ముందు 21 మంది చిన్నారులు తమ గోడు వెల్లబోసుకున్నారు.. దీంతో అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భయానక హింసకు సంబంధించి ఐదుగురు ఆశ్రమ సిబ్బందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విస్తృతమైన దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.

ఇకపోతే, ఆశ్రమాన్ని సీల్‌ చేశామని, పిల్లలను ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని ఇండోర్‌ ఏసీపీ అమరేంద్ర సింగ్‌ తెలిపారు. వాత్సల్యపురం జైన్‌ ట్రస్టు నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద నమోదు కాలేదని, ఈ ట్రస్టుకు బెంగళూరు, సూరత్‌, జోధ్‌పూర్‌, కోల్‌కతాలో కూడా ఆశ్రమాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇండోర్‌ ఆశ్రమంలో మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెం దిన చిన్నారులు ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

గత ఏడాది బరేలీలోని ఓ అనాథాశ్రమం అధిపతి ఎనిమిదేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు చేశారు. జులై 31న జరిగిన ఘటనపై అనాథాశ్రమ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బాలిక వార్డెన్‌కి, ఆమె సోదరికి సమాచారం అందించింది. IPC, POCSO చట్టం కింద కేసు నమోదు చేయబడింది.