అది మానవ తప్పిదం, చైనా సైబర్ దాడి కాదు, కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ స్పష్టీకరణ
ముంబైలో గత అక్టోబరులో జరిగిన విద్యుత్ గ్రిడ్ వైఫల్యానికి చైనా హ్యాకర్లు కారణమన్న వార్తలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తొసిపుచ్చారు. అది మానవ తప్పిదమేనని, సైబర్ దాడి కాదని పేర్కొన్నారు.
ముంబైలో గత అక్టోబరులో జరిగిన విద్యుత్ గ్రిడ్ వైఫల్యానికి చైనా హ్యాకర్లు కారణమన్న వార్తలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తొసిపుచ్చారు. అది మానవ తప్పిదమేనని, సైబర్ దాడి కాదని పేర్కొన్నారు. ఆ ఘటనపై రెండు బృందాలు ఇన్వెస్టిగేట్ చేశాయని, అది మానవపొరబాటని తేల్చాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఓ బృందం నివేదిక కూడా ఇచ్చిందన్నారు. సైబర్ ఎటాక్ జరిగింది గానీ, దానికి ఈ ఘటనకు సంబంధం లేదన్నారు. మన ఉత్తర, దక్షిణాది ప్రాంతాల్లో ఇలాంటి ఎటాక్ లు జరుగుతాయి గానీ మాల్ వేర్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ లోకి చొరబడజాలదు అని సింగ్ స్పష్టం చేశారు. ఈ దాడుల వెనుక చైనా లేదా పాకిస్తాన్ హస్తం ఉందనడానికి ఆధారాలు లేవని అయన అన్నారు. చైనా దీన్ని తప్పకుండా ఖండిస్తుందని సింగ్ పేర్కొన్నారు.
అన్నట్టుగానే చైనా ఈ వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇవి బాధ్యతారాహిత్యమని ట్వీట్ చేసింది. అయితే న్యూయార్క్ పోస్ట్ వంటి పత్రిక ..స్టడీ అంటూ పెద్ద ఆర్టికల్ ని ప్రచురించింది. ముంబైలో విద్యుత్ గ్రిడ్ వైఫల్యానికి చైనా హ్యాకర్లు కారణమని పేర్కొంది. ఇంత రభస జరిగాక కేంద్ర మంత్రి దీనిపై ఈ దాడుల వెనుక ఏ విదేశీ హస్తమూ లేదని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
Read More :