Power Shortage: దేశంలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రతి మూడు కుటుంబాల్లో రెండు కుటుంబాలు కరెంటు కోతలకు(Power Cuts) ప్రభావితమౌతున్నాయని తెలింది. గత 122 ఏళ్లలో ఎన్నడూ చూడని హీట్ వేవ్స్ దేశంలో ఉండగా రోజూ కరెంట్ కోతలు సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని దేశవ్యాప్తంగా 11,142 మందితో నిర్వహించిన ఈ సర్వే చెబుతోంది. కేవతలం 12 శాతం మంది మాత్రమే పవర్ బ్యాకప్ సౌరక్యాలు కలిగి ఉన్నట్లు తేలింది. మిగిలిన వారికి ఇన్వర్టర్లు ఉండటం లేదా ఎటువంటి పవర్ బ్యాకప్ లేదని వెల్లడైంది. ఇటువంటి తరుణంలో దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను(Nuclear Power Plant) నెలకొల్పటం అనేక అడ్డంకులతో కూడుకున్న అంశంగా మారింది. డాక్టర్ హోమీ బాబా ఆధ్వర్యంలో మార్చి 1944లో దేశంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. అప్పట్లో అమెరికాకు చెందిన బ్లీడర్ రియాక్టర్ ప్రపంచంలో మెుదటి సారిగా కరెంట్ తయారు చేసిన పవర్ ప్లాంట్. 2021 జనవరి నాటికి దేశంలో 22 న్యూక్లియర్ రియాక్టర్లు ఉండగా అవి మెుత్తం 6,780 మెగా వాట్ల విద్యుత్తును అందిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం దేశంలో మెుత్తం విద్యుత్ తయారీలో కేవలం 3.3 శాతం న్యూక్లియర్ ప్లాంట్ల నుంచి తయారవుతోంది. న్యూక్లియర్ పవర్ తయారీ దేశంలో వెనకబడింది. అసలు న్యూక్లియర్ పవర్ తయారీలో దేశం ఎందుకు వెనకబడింది, దానికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం..
న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నెలకొల్పాలంటే భారీ ఖర్చు అవుతుంది. దీనికి తోడు వీటి నిర్వహణకు చాలా అత్యుత్తమ సాంకేతికత అవసరం అవుతుంది. సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లను నెలకొల్పటం ఎంత కష్టమైనదో.. ఇది కూడా అలాంటిదేనని చెప్పుకోవాలి. మరో పక్క చైనా మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. 2026 నాటికి తమ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని మూడింతలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. 2002లో తమిళనాడులో ప్రారంభమైన కుండకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెండు యూనిట్లతో నిర్మాణానికి 13 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసినా.. తరువాత అది రూ. 17,270కి చేరింది. ఇది పూర్తి స్థాయిలో పూర్తి కావటానికి 22 వేల కోట్లు అవసరమని తెలుస్తోంది. తరువాత రానున్న మూడు, నాలుగు యూనిట్ల నిర్మాణానికి రూ.39,849 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు రష్యా, చైనాలు మాత్రమే ఈ రంగంలో అగ్రగాములుగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీలు కారణంగానే అది సాధ్యమౌతోంది. ఈ ప్లాంట్ల నిర్వహణలో సేఫ్టీ, టెక్నాలజీకి భారీగా ఖర్చవుతోంది.
మరో పక్క దేశంలో వీటిని నెలకొల్పటం కష్టతరం కావటానికి మరో కారణం వాటిపై జరుగుతున్న చెడు ప్రచారమే. 2011లో ఫుకుషిమా పేలుడు కారణంగా నేరుగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ.. పది మిలియన్ల మంది దీనికి ప్రభావితులయ్యారు. ఈ ప్రమాదం కారణంగా జపాన్ ప్రభుత్వాలనికి ట్రిలియన్ డాలర్లు ఖర్చవగా.. దీని నుంచి రకవర్ కావటానికి 40 ఏళ్లు పడుతుందని తెలుస్తోంది. భారత ప్రభుత్వం వీటి నిర్మాణంలో తెచ్చిన చట్టాలు కారణంగా అనేక దేశాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంలేదు. ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ నిబంధనలు వీటి ఖర్చులను మరింతగా పెంచుతున్నాయి. వీటన్నింటికి అదనంగా భారత్ వద్ద న్యూక్లియర్ ఫ్యూయల్ లభ్యత తక్కువ ఉండటం మరో కారణంగా నిలుస్తోంది. మరో పక్క హరిత విద్యుత్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు న్యూక్లియర్ ఎనర్జీని వెనక్కు నెడుతున్నాయి. మన దేశంలో పరిస్థితులు ఇలా ఉండగా అభివృద్ధి చెందిన ఫ్లాన్స్ తమ దేశీయ అవసరాల్లో 70 శాతం న్యూక్లియర్ పవర్ తయారీ ద్వారా తీర్చుకుంటోంది.
చివరగా.. భారతదేశానికి అతి పెద్ద అంశం, ముఖ్యంగా సుదీర్ఘ విద్యుత్ కోతలు, రికార్డు హీట్ వేవ్స్ మధ్య న్యూక్లియర్ పవర్ దేశానికి చాలా అవసరమైనదిగా తెలుస్తోంది. దీనివల్ల పవర్ గ్రిడ్ స్టెబిలిటీతో పాటు తక్కువ ధరకు విద్యుత్ దేశంలో అందుబాటులోకి వస్తుంది.
ఇవీ చదవండి..
Ration Card Rules: రేషన్ కార్డులకు కొత్త రూల్స్ ఇవే.. వారు కార్డ్ సరెండర్ చేయకపోతే చర్యలు తప్పవు..