Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆర్టికల్ 370 రద్దుకు ముందు ప్రధాని మోదీ ‘రహస్య ప్రణాళిక’.. సెక్యూరిటీ లేకుండా..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలక నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 5 న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరుకు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే, ఈ సంచలన నిర్ణయానికి ముందు నరేంద్ర మోదీ రహస్య ప్రణాళికను అవలంభించారు.

PM Modi: ఆర్టికల్ 370 రద్దుకు ముందు ప్రధాని మోదీ ‘రహస్య ప్రణాళిక’.. సెక్యూరిటీ లేకుండా..
PM Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2024 | 11:55 AM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలక నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 5 న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరుకు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే, ఈ సంచలన నిర్ణయానికి ముందు నరేంద్ర మోదీ రహస్య ప్రణాళికను అవలంభించారు. దీనికోసం ఆయన దేశ రాజధానిలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరులవలే.. ఒంటరిగా ప్రయాణించారు.

జమ్ము కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసే ఒకరోజు ముందు అంటే.. 2019 ఆగస్టు 4న.. ప్రధాని నరేంద్రమోడీ.. రాష్ట్రపతిని కలిసేందుకు సాయంత్రం ఆలస్యంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు ఇదే సరైన సమయమని గమనించారు. ఆ సమయంలో ప్రధానమంత్రి తన భద్రతా సిబ్బంది, అనుచరగణం లేకుండా గుర్తుపట్టలేని కారులో ఒంటరిగా ప్రయాణించారు. వివాదాస్పద ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై ఆయన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, సున్నితమైన ఎజెండా గురించి అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించడానికి ప్రధాని ఇదే మార్గమని భావించారు.

దేశంలో యథాతథ స్థితిని మార్చడానికి బిజెపి ఎత్తుగడలను వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రత్యర్థులకు (విపక్ష పార్టీలు) ఆశ్చర్యం కలిగించే పెద్ద ప్రణాళికలో రహస్య అస్త్రాలను ప్రధాని మోదీ సంధించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు మెజారిటీ.. మద్దతు లేని రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019ని ప్రవేశపెట్టి.. మద్దతును కూడగట్టేందుకు ప్రధానిమోదీ సిద్ధమయ్యారంటూ రాజకీయ దాడి ప్రారంభైంది. లోక్‌సభలో కాషాయ పార్టీ సొంతంగా మెజారిటీని పొందింది. లోక్‌సభలో చట్టాన్ని తీసుకురావడం మొదట ప్రతిపక్షాలను అప్రమత్తం చేసి, రాజ్యసభలో తమ అధిక సంఖ్యాకులు ఈ చర్యను అడ్డుకోవడంలో వారికి సహాయపడుతుందని ప్రధాని మోదీ మొదట భావించారు. ఆ తర్వాత మోదీ “స్టీల్త్” (రహస్య ప్రణాళిక) స్క్రిప్ట్‌ను రూపొందించి.. సఫలీకృతం అయ్యారు.

త్వరలో విడుదల కానున్న చిత్రం ‘ఆర్టికల్ 370’లో భాగమైన బిజెపి హామీలలో ఒకదాన్ని నెరవేర్చడానికి మోడీ ప్రదర్శించిన రహస్య రాజకీయ ఆపరేషన్ గురించి ఇప్పటివరకు తెలియని వివరాలను ఇప్పుడు అధికారిక మూలాలు కూడా ధృవీకరించాయి. బీజేపీ అద్భుతమైన విజయం, మోడీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత .. ఎలాంటి వ్యూహాలు రచించారు. జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం చేసిన ప్రతిజ్ఞకు ఆయన నిబద్ధతను నొక్కిచెప్పడం.. బిజెపి పట్ల విశ్వాసం పెరిగేలా చేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను దానిలో వివరించారు. రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకుని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఏ విధంగా ఆకట్టుకుంది అనేదాన్ని కూడా ప్రస్తావించారు.

370 రద్దు నాటి నుంచి J&Kలో ఉగ్రవాద కేసులు తగ్గుముఖం పట్టడం.. ఈ ప్రాంతంలో పర్యాటకుల రాక బాగా పెరగడం, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రెట్టింపు కావడం వంటివి మోడీ స్క్రిప్టు నుంచి హోం మంత్రి షా అమలు చేసిన నిర్ణయాలకు ధ్రువీకరణగా ప్రభుత్వం పేర్కొంది . ‘ఆర్టికల్ 370’లో అనేక సంచలనాత్మక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ దశాబ్దాలుగా స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ను NIA మహిళా అధికారి కాలర్ పట్టుకున్న దృశ్యం కూడా ఇందులో చూపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..