
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రమంత్రి అమిత్‌షా కఠినచర్యలు ప్రకటించారు. ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే పోలీసులకు అప్పగించాలని సూచించారు. లేదంటే రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమవుతుందని , ఎవరి దగ్గరైనా ఆయుధాలు లభిస్తే గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. అలాగే ఈ హింసకు సంబంధించిన ఆరు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. హింసను అదుపు చేయడంలో విఫలమైన మణిపూర్ డీజీపీపై వేటు పడింది. దొంగేల్ స్థానంలో రాజీవ్‌సింగ్‌ను డీజీపీగా నియమించారు.
గత మూడు రోజులుగా ఇంఫాల్, మోరె, చురాచాంద్‌పుర్ సహా పలు ప్రాంతాల్లో అమిత్‌షా పర్యటించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా స్థానిక అధికారులతో మాట్లాడారు. మణిపుర్ గవర్నర్ నేతృత్వంలో పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించాయి. . పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హోం శాఖకు చెందిన చెందిన ఉన్నతస్థాయి అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని అమిత్‌షా తెలిపారు. ఆయుధాలు కలిగి ఉన్నవాళ్లు వెంటనే పోలీసులకుఅప్పగించాలి. రేపటి నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తారు. కూబింగ్ ఆపరేషన్ తరువాత ఆయుధాలతో దొరికిన వాళ్లపై కఠిన చట్టాల కింద కేసులు పెడుతాం. అందుకే ఆయుధాలు దాచుకున్న వాళ్లు సరెండర్ చేయాలి. పుకార్లను నమ్మవద్దని పౌరసమాజానికి నా విజ్ఞప్తి. శాంతిని కాపాడాలని కోరారు అమిత్ షా.
మణిపూర్‌లో గత 40 రోజులుగా హింస చెలరేగుతోంది. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎస్టీ హోదా విషయంలో మెయిటీలు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలపై దాడులకు పాల్పడుతున్న 40 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు కాల్చిచంపినట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందానికి మెయిటీలు , కుకీలు కట్టుబడి ఉండాలని అమిత్‌షా స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో పరిస్థితి మెరుగుదల గురించి సమాచారం ఇస్తూ, 15 పెట్రోల్ పంపులను ఎంపిక చేశామని, అవి పగలు, రాత్రి తెరిచి ఉంటాయని హోంమంత్రి చెప్పారు. మణిపూర్‌లో కూడా రైలు ద్వారా సరఫరా ప్రారంభమవుతుంది. ఇలా అన్ని విధాలుగా రాష్ట్రంలో లేనిపోనివి నెరవేరుతాయి. 2-3 రోజుల్లో రైల్వే సేవలు పునరుద్ధరించబడతాయి.
భారత ప్రభుత్వానికి చెందిన కొందరు విద్యాశాఖాధికారులు మణిపూర్‌కు చేరుకున్నారని, తద్వారా పిల్లలకు విద్యావ్యవస్థ సులభతరం అవుతుందని హోంమంత్రి చెప్పారు. పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అమిత్ షా పేర్కొన్నారు. అగ్రిమెంట్లలోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఆయుధాలు ఉన్నవారు పోలీసులకు అప్పగించి లొంగిపోవాలన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం