చెన్నై, అక్టోబర్ 5: రోడ్లపై బైక్‌తో స్టంట్‌లు చేస్తూ ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిన కేసులో ఓ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ ర్యాష్ డ్రైవింగ్‌పై యువతను ప్రేరేపించేలా అతని వీడియోలు ఉన్నాయంటూ అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు వాదించిన మద్రాసు హైకోర్టు సదరు యూట్యూబర్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇలాంటి గుణపాఠం నేర్చుకోవాల్సిందేనని న్యాయస్థానం ఆగ్రహించింది. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే మూసివేయాలని కోర్టు ఆదేశించింది. అసలేం జరిగిందంటే..
తమిళనాడు చెందిన టీటీఎఫ్ వాసన్ (Y) బైక్ స్టండ్ వీడియోలతో యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటాడు. అతని ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 17న కాంచీపురం సమీపంలోని చెన్నై-వెల్లూర్ హైవేపై అతివేగంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో యూట్యూబర్ టీడీఎఫ్ వాసన్‌పై బాలుశెట్టిపై చత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. దమాల్ సమీపంలో బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. ఆ సమయంలో అతడు హెల్మెంట్, రేస్ సూట్ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో అతడి చేతికి మాత్రం ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతన్ని సెప్టెంబర్ 19న పోలీసులు అరెస్ట్ చేశారు.
పుఝల్ జైలులో ఉన్న టీడీఎఫ్ వాసన్ బెయిల్ పిటిషన్ తాఖలు చేయగా దానిని కాంచీపురం కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో సెప్టెంబరు 26న టీడీఎఫ్ వాసన్ తరపున మద్రాసు హైకోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలైంది. రోడ్డు ప్రమాదంతో పశువులు రోడ్డుకు అడ్డంగా రావడంతో ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వాహనం చక్రం పైకి లేచిందని, బ్రేకులు వేయకుంటే ప్రమాదం జరిగేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ప్రమాదంలో గాయపడిన తనకు జైలులో సరైన వైద్యం అందడం లేదని, గాయాలు తీవ్రమవుతున్నందున ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. తాను నిర్దోషినని, ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Popular Biker/YouTuber #TTFVasan got into an accident while trying a dangerous Stunt in the Chennai – Bengaluru highway yesterday..
Wishing him a speedy recovery
Don’t try this.. You are endangering your life as well as the lives of fellow road users pic.twitter.com/hE2YRQCeOX
— Ramesh Bala (@rameshlaus) September 18, 2023
వాసన్ పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. వాసన్‌కు యూట్యూబ్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు రూ.20 లక్షల ఖరీదు చేసే బైక్‌పై రూ.4 లక్షల రేస్ సూట్ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తున్ననని, అందుకే ప్రమాదం తప్పిందని తన వీడియోల్లో చెబుతున్నాడు. ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి రేస్‌లకు రావాలని యువతను ప్రేరేపిస్తున్నాడు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ వీడియోలు చూసిన మరికొందరు యువకులు ఇలాంటి ప్రమాదకర సాహసాలు చేయడానికి తమ తల్లిదండ్రులను రూ.2 లక్షల విలువైన బైక్ కొనివ్వమని అడుగుతున్నారు. కుదరకపోతే కొందరు దోపిడీలకు కూడా పాల్పడుతున్నారని ప్రభుత్వం తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. అలాగే యువతను ప్రేరేపించేలా వ్యవహరించిన పిటిషనర్ చర్య గుణపాఠం కావాలి. కోర్టు కస్టడీలోనే కొనసాగాలని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ సీవీ కార్తికేయన్ తోసిపుచ్చారు. అలాగే చేతి గాయానికి చికిత్స అందించాలని జైలు వైద్యులను ఆదేశించిన న్యాయమూర్తి, డీడీఎఫ్ వాసన్ యూట్యూబ్ సైట్‌ను మూసివేయాలని, బైక్‌ను తగులబెట్టాలని ఆదేశించారు.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.