హిమాచల్‌ప్రదేశ్‌లో పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా.? ఊడుతుందా.? అన్న విషయంపై సస్సెన్స్ కంటిన్యూ అవుతోంది. సీఎం పదవికి తాను రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు సుఖ్విందర్‌సుక్కు. తనను రాజీనామా చేయాలని ఎవరు కోరలేదన్నారు సుఖ్విందర్. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ మధ్య హిమాచల్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆమోదించారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడింది.
రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చేరిపోయారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి విక్రమాదిత్యా పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత చేజారింది. సీఎం సుఖ్విందర్‌సింగ్ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు హిమాచల్ సీఎంను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్, ప్రియాంక చర్చించారు.