కర్నాటకలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను రద్దు చేస్తామని అధికార పార్టీ నేతలంటున్నారు. ముఖ్యంగా
చాలా రోజుల పాటు రగిలిన హిజాబ్ వివాదంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హిజాబ్‌పై బ్యాన్‌ను ఎత్తేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు రేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా మార్మోగింది. బీజేపీ ఓటమికి హిజాబ్ వివాదం కూడా దోహదపడిందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేసిన ప్రకటనలు ఇప్పుడు అమల్లోకి వస్తే హిజాబ్ అంశం ఏమోతుందనేది ఆసక్తి రేపుతోంది. ముస్లిం మహిళలు కళాశాలకు హిజాబ్ లేదా బుర్ఖా ధరించి రావడాన్ని అడ్డుకుంటూ భజరంగదళ్, విశ్వహిందూపరిషత్ వంటి బీజేపీ అనుబంధ సంస్థల విద్యార్ధులు పోటీగా కాషాయ కండువాలతో తరగతులకు హాజరయ్యారు. దీంతో వివాదం రేగింది. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
హిజాబ్ సహా అప్పటి ప్రభుత్వం తీసుకున్న మతపరమైన నిర్ణయాల్ని ఎత్తివేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైన మహిళా ముస్లిం ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా హిజాబ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని వెల్లడించారు.
హిజాబ్ అంశంపై మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలనేది ఆలోచించుకుని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం దృష్టి ఎన్నికల్లో ఇచ్చిన 5 కీలక హామీలను నెరవేర్చడంలోనే ఉందన్నారు.
We will see in future what best we can do. Right now, we have to fulfil the five guarantees we made to the people of Karnataka: State minister Dr G Parameshwara on Amnesty India demanding hijab ban in Karnataka be rolled back pic.twitter.com/6jt63uXaf3
— ANI (@ANI) May 24, 2023
ఈ క్రమంలో కర్ణాటక విద్యాసంస్థల్లో మహిళలు మరోసారి హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యే పరిస్థితి వస్తుందా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతోంది . ఇప్పటికైతే ఏడాదిగా హిజాబ్ నిషేధం రాష్ట్రంలో అమలవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం