కేరళ అసెంబ్లీలో హైడ్రామా.. ‘గవర్నర్ గో-బ్యాక్’ నినాదాల హోరు

కేరళ అసెంబ్లీలో బుధవారం హైడ్రామా నడిచిందిఆ. అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సభ తీర్మానాన్ని ఆమోదించడాన్ని పదేపదే విమర్శించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను రీకాల్ చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.. వివరాల్లోకి వెళ్తే.. మొదట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. తన ప్రసంగ  పాఠం చదువుతూ గవర్నర్ మధ్యలో ఒక్క సెకండ్ ఆగి.. ‘ఈ స్పీచ్ లో ఈ పేరాను నేను చదవబోతున్నాను. […]

కేరళ అసెంబ్లీలో హైడ్రామా.. గవర్నర్ గో-బ్యాక్ నినాదాల హోరు

Edited By:

Updated on: Jan 29, 2020 | 3:16 PM

కేరళ అసెంబ్లీలో బుధవారం హైడ్రామా నడిచిందిఆ. అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సభ తీర్మానాన్ని ఆమోదించడాన్ని పదేపదే విమర్శించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను రీకాల్ చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.. వివరాల్లోకి వెళ్తే.. మొదట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. తన ప్రసంగ  పాఠం చదువుతూ గవర్నర్ మధ్యలో ఒక్క సెకండ్ ఆగి.. ‘ఈ స్పీచ్ లో ఈ పేరాను నేను చదవబోతున్నాను. దీన్ని చదవవలసిందిగా ముఖ్యమంత్రి నన్ను కోరారు. అయితే ఇది ఒక పాలసీ కింద గానీ, పథకం కింద గానీ రాదని  నేను భావించినప్పటికీ.. ఇది ప్రభుత్వ అభిప్రాయమని సీఎం చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ.. ఆయన కోర్కె మేరకు ఈ పేరా చదువుతున్నాను’ అని విధిలేక ఆ పేరా చదివారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం రూపొందించిన స్పీచ్ ఇది ! ఇందులో వివాదాస్పద సీఏఏను విమర్శిస్తున్న అంశమే గవర్నర్ కు చిక్కు సమస్య తెఛ్చిపెట్టింది. కాగా-అసెంబ్లీలో అడుగు పెడుతున్న గవర్నర్ కు సీఎం పినరయి విజయన్, స్పీకర్ శ్రీరామకృష్ణన్ వేదికవద్దకు దారి చూపుతుండగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కు చెందిన ఎమ్మెల్యేలు ఆయనను అడ్డుకున్నారు. చేతిలో ప్లకార్డులు పట్టుకున్న వారు.. ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వేదిక వద్దకు చేరుకునేందుకు అసెంబ్లీ మార్షల్స్ మానవహారంగా ఏర్పడవలసివచ్చింది. సీఎం, స్పీకర్….  విపక్ష సభ్యులను వారించబోయినప్పటికీ ఫలితం లేకపోయింది. వారు గవర్నర్ కు వ్యతిరేక నినాదాలు చేస్తూనే వచ్చారు.

సుమారు 10 నిముషాల గందరగోళం అనంతరం.. గవర్నర్ వేదికవద్దకు చేరగానే ‘జనగణమన’ జాతీయ గీతం ప్లే కావడం విశేషం. అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలో నిలబడి స్లోగన్స్ సాగించారు. గవర్నర్ తన స్పీచ్ ప్రారంభించగానే వారంతా సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు కూర్చున్నారు.  గవర్నర్ బీజేపీకి, తన గురువైన ఆర్ ఎస్ ఎస్ కు కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని, కానీ ఇప్పుడు లెఫ్ట్ పార్టీల సభ్యులు, ఆయన భాయీ.. భాయీగా మారిపోయారని విపక్షనేత రమేష్ చెన్నితాల ఆరోపించారు.