‘అమ్మా ! మీకో దండం ! ఏడేళ్లలో ఏం వెలగబెట్టారని ?’ ఎంపీ హేమమాలినిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ !

| Edited By: Anil kumar poka

May 24, 2021 | 6:40 PM

ఈ నెల 30 వ తేదీతో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అనేకమంది బీజేపీ ఎంపీలు తమ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ ఏడు సంవత్సరాల కాలాన్ని..

అమ్మా ! మీకో దండం ! ఏడేళ్లలో ఏం వెలగబెట్టారని ? ఎంపీ హేమమాలినిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ !
Hemamalini Tweets On Completion Of 7 Years As Mathura Mp
Follow us on

ఈ నెల 30 వ తేదీతో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అనేకమంది బీజేపీ ఎంపీలు తమ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ ఏడు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వీరిలో యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎంపీ, బాలీవుడ్ నటి కూడా అయిన హేమమాలిని ఒకరు. ఈ అకేషన్ ని పురస్కరించుకుని ఆమె ఓ ట్వీట్ చేశారు.’ఇన్నేళ్లూ నా పట్ల, నా కృషి పట్ల నన్ను అభిమానించి నన్ను ప్రశంసించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు.. అన్ని ప్రాజెక్టుల్లో మీరు నాకు సహకరిస్తూ వచ్చారు. మథుర బృందావన్ లో ఏడేళ్లు పూర్తి చేసుకున్నాను’ అని ఆమె ట్వీటించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై ట్రోలింగ్ షురూ అయింది. ‘నాట్ హ్యాపీ మేడమ్ ! నిజానికి మీకు ఓటేసినందుకు మేం సిగ్గుపడుతున్నాం..మాకు కస్టాలు వచ్చినప్పుడు మీరు గానీ, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గానీ ఏమైపోయారు ? ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ నిష్ప్రయోజకులు..ఈ సారి మా పొరబాటును సరిదిద్దుకుంటాం’ అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు..అసలు ఈ పార్లమెంటరి నియోజకవర్గంలో మీరేం చేశారు ? ముఖ్యంగా కరోనా కాలంలో మీరు చేసిన నిర్వాకమేమిటి అని ప్రశ్నించారు. ఇలా ఇంచు మించు ఇద్దరు యూజర్లూ ఒకే విధంగా స్పందించారు .

కాగా-గత ఏడాది సెప్టెంబరు 20 న హేమమాలిని మథురలోని లోకల్ రైల్వే స్టేషన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ లిఫ్ట్ ను, ఎస్కలేటర్ ను లాంచ్ చేశారు. ఇంకా ఇక్కడ మరిన్ని ప్రాజెక్టులు తేవడానికి కృషి చేస్తానన్నారు. ఆ తరువాత మళ్ళీ ఆమె జాడ లేదు.

Tweet

Tweets 2

Tweets 3

మరిన్ని చదవండి ఇక్కడ : police brutality on dalit youth….దళితుడికి పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు, మంచి నీరు అడిగితే ఖాకీలు ఏం చేశారంటే ..? కర్నాటకలో దారుణం
Viral Video: ఈ కాకి ముక్కు ఎంత పదునో… చెట్టుకు ఎంత పెద్ద బొక్క పెట్టింది చూడండి… ( వీడియో )