Heeralal Samariya: ప్రధాన సమాచార కమిషన్‌గా హీరాలాల్ సమారియా.. దళితులకు స్థానం కల్పించడం ఇదే తొలిసారి

కేంద్ర సమాచార కమిషన్‌కు కొత్త ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3తో ముగియడంతో ఈ సీటులో ఖాళీ ఏర్పడింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో సమారియా ప్రమాణం స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశంలో ప్రధాన సమాచార కమిషనర్‌గా దళితులు బాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘనతను సాధించారు హీరాలాల్ సమారియా. ఈయన ప్రధాన సమాచార కమిషనర్‌గా

Heeralal Samariya: ప్రధాన సమాచార కమిషన్‌గా హీరాలాల్ సమారియా.. దళితులకు స్థానం కల్పించడం ఇదే తొలిసారి
Central Government Appoints Heeralal Samariya As New Chief Information Commissioner

Updated on: Nov 06, 2023 | 1:43 PM

కేంద్ర సమాచార కమిషన్‌కు కొత్త ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3తో ముగియడంతో ఈ సీటులో ఖాళీ ఏర్పడింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో సమారియా ప్రమాణం స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశంలో ప్రధాన సమాచార కమిషనర్‌గా దళితులు బాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘనతను సాధించారు హీరాలాల్ సమారియా. ఈయన ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన తర్వాత, ఎనిమిది సమాచార కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో ఇద్దరు సమాచార కమిషనర్లు ఉన్నారు.

పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అక్టోబరు 30న సుప్రీంకోర్టు ఆదేశించడంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతమైంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన సమారియా 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇది జరగకపోతే సమాచార హక్కు చట్టం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది సుప్రీం కోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెలువరించింది. దీంతో అన్ని రాష్ట్రాల నుండి దాఖలైన పోస్టులు, రాష్ట్ర సమాచార కమిషన్‌ పరిధిలోని ఖాళీలు, అక్కడ పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసులతో పాటూ వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించాలని డిఓపిటిని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..