Heavy Rains: ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు..

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains: ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు..
Up Rains

Updated on: Oct 09, 2022 | 7:28 PM

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అలీఘడ్‌ నగరం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. అలీఘడ్‌ ప్రభుత్వాసుపత్రిలోకి కూడా వరదనీరు చేరింది. దీంతో పేషంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజస్థాన్‌‌లోని సికార్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూం ప్రజలు నిరసరకు దిగుతున్నారు. సికార్‌ వాసులు వరదనీటిలో దిగి నిరసన తెలిపారు. తోపుడుబళ్లలో వరదనీటిలో నడుస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..