India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు

|

Sep 02, 2021 | 7:34 AM

ఉత్తరాదిన వానలు దంచి కొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న

India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు
Floods
Follow us on

Heavy Rains: ఉత్తరాదిన వానలు దంచి కొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజధాని నగరం అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయం అయ్యాయి. అటు, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. వరద నీరు రహదార్లను ముంచెత్తింది. మధురలోని పలు ప్రాంతాల్లో నడుంలోతు నీరు చేరడంతో వాహనాలు మునిగిపోయాయి.

ఇక, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. చమోలీ జిల్లాలోని పాగల్‌ నేల్‌ దగ్గర భద్రినాథ్‌ జాతీయ రహదారి మూసుకుపోయింది. ఈ రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులకు కష్టాలు తప్పడం లేదు.  అటు బీహార్‌లోనూ భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వైశాలి జిల్లాలోని ప్రఖ్యాత అశోక స్థంబం, బుద్ద శేష స్థూపం వరద నీటిలో మునిపిపోయాయి. పర్యాటక ప్రదేశాలన్నీ వరదల్లో చిక్కుకున్నాయి.

రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అసోం ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. భారీ వర్షాలకు అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. 21 జిల్లాలు నీటిలో నానుతున్నాయి. మొత్తంగా అసోం రాష్ట్రంలో 6 లక్షల 47 వేల మంది లక్షల మంది వరదల బారిన పడ్డారు.

అటు, మధ్యప్రదేశ్‌లోనూ బలమైన గాలులు, వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిధి జిల్లాలోని భూమాద్‌, దేవ్రిడ్యామ్‌ దగ్గర టోర్నడో టెన్షన్‌ పెట్టించింది. బలమైన గాలులకు డ్యామ్‌లోని నీళ్లు ఒక్కసారిగా పైకి లేచాయి. ఆ గాలుల ధాటికి టోర్నడోగా మారింది. ఆకాశానికి సుడులు తిరుగుతూ ఎగిసింది. భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉందీ డ్యామ్‌. చాలాసేపు టోర్నడో ఉంది. దీన్ని చూసేందుకు స్థానికులు ఆ ప్రాంతానికి పెద్దయెత్తున వచ్చారు.

Read also: Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో