ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు, ప్రజలకు సీఎం వార్నింగ్

| Edited By: Anil kumar poka

Aug 06, 2020 | 11:00 AM

ముంబైని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కొలాబా ప్రాంతం 46 ఏళ్ళ తరువాత మళ్ళీ దాదాపు పూర్తిగా జలమయమైంది. ఒక్క రోజులోనే ఇక్కడ 331.8 మి.మీ. వర్షం కురిసింది.

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు, ప్రజలకు సీఎం వార్నింగ్
Follow us on

ముంబైని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కొలాబా ప్రాంతం 46 ఏళ్ళ తరువాత మళ్ళీ దాదాపు పూర్తిగా జలమయమైంది. ఒక్క రోజులోనే ఇక్కడ 331.8 మి.మీ. వర్షం కురిసింది. దీంతో పాటు అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సీఎం ఉధ్ధవ్ థాక్రే హెచ్ఛరించారు. గురు, శుక్రవారాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో బాటు గంటకు 80 కి.మీ. వేగంతో పెను గాలులు వీస్తాయని పేర్కొంది. శాంతాక్రజ్ విమానాశ్రయంలో 162,3 మి.మీ .వర్షపాతం నమోదైంది. ముంబైలో ఈ నెల మొదటి అయిదు రోజుల్లోనే 64  శాతం వర్షపాతం నమోదైనట్టు అంచనా. గత రెండు రోజులుగా శివారు ప్రాంతాల్లో గంటకు సుమారు 107 కి.మీ.వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. సబర్బన్, మెట్రో రైళ్లను పాక్షికంగా పునరుధ్దరించారు .