Godavari: గోదావరికి భారీగా వరద.. జయక్‌వాడీ ప్రాజెక్ట్‌ నుంచి విష్ణుపురి వరకు నిండుకుండల్లా ప్రాజెక్టులు

|

Sep 30, 2021 | 9:32 AM

వరుణుడు శాంతించినా వరద ఉదృతి మాత్రం తగ్గడం లేదు. ఎగువ నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో

Godavari: గోదావరికి భారీగా వరద.. జయక్‌వాడీ ప్రాజెక్ట్‌ నుంచి విష్ణుపురి వరకు నిండుకుండల్లా ప్రాజెక్టులు
Vishnupuri Project
Follow us on

Godavari River – Irrigation Projects: వరుణుడు శాంతించినా వరద ఉదృతి మాత్రం తగ్గడం లేదు. ఎగువ నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్రలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన జయక్‌వాడీ ప్రాజెక్ట్‌ నుంచి దిగువన విష్ణుపురి వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో ఉగ్రరూపం దాల్చింది గోదావరి.

నిర్మల్‌ జిల్లా బాసర వద్ద ఉప్పొంగి ప్రవహిస్తోంది గోదావరి. నదికి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. హరహర కాటేజ్ ను వరద చుట్టుముట్టడంతో కాటేజ్ లో ఉంటున్న వారిని రక్షించారు గజ ఈతగాళ్లు. వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి.

ఇక ఇటు భద్రాచలం వద్ద 43.8 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఐతే మరో 2 నుండి మూడు అడుగులు పెరిగి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Read also: Water Dispute: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వొద్దు.. గోదావరినది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్‌ లేఖ.. వివరాలు