Rains: కేరళ, కర్ణాకటలో భారీ వర్షాలు.. తమిళనాడుకు పొంచిఉన్న వరద ముప్పు..

|

May 19, 2022 | 9:07 AM

Rains: కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న శారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రానికి వరద ముప్పు..

Rains: కేరళ, కర్ణాకటలో భారీ వర్షాలు.. తమిళనాడుకు పొంచిఉన్న వరద ముప్పు..
Rains
Follow us on

Rains: కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న శారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రానికి వరద ముప్పు ఏర్పడింది. తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న దిగువకు వరద నీరు భారీగా చేరుకుంటోంది. ఒక్కేనక్కల్ జలపాతాలకు కావేరీ నది వరద ముప్పు పొంచి ఉంది. ఒక్కేనక్కల్ జలపాతాలకు కావేరీ నది వరద ముప్పు పొంచిఉంది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. పర్యాటకుల రాకపై నిషేధం విధించారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు కుట్రాలం జలపాతాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. కుట్రాలం జలపాతాలకు పర్యటకుల రాకను నిషేధించారు. అలాగే తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో.. తమిళనాడు అధికారులు అలర్ట్ అయ్యారు. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.