Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న నదులు.. రెడ్‌ అలర్ట్‌!

మండి జిల్లాలోని బియాస్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మరోవైపు జిల్లా యంత్రాంగం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీ సహా యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న నదులు.. రెడ్‌ అలర్ట్‌!
Heavy Rains Flood

Updated on: Jul 01, 2025 | 10:43 AM

దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్య భారతదేశం, ఉత్తరాఖండ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, విదర్భ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వర్షం కారణంగా ఆరుగురు మరణించారని తెలిసింది.

వీడియో ఇక్కడ చూడండి…

హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. మండి జిల్లాలోని బియాస్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. హిమాచల్‌లో భారీ వర్షం కారణంగా 34 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది.  285 రోడ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రవాణ వ్యవస్థ స్థంబించింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవటంతో స్కూళ్లు, కాలేజీలు కూడా మూసివేశారు అధికారులు.  మరోవైపు జిల్లా యంత్రాంగం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీ సహా యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వివరాల కోసం క్లిక్ చేయండి..