దేశ రాజధాని సమీప ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

| Edited By:

Apr 30, 2020 | 8:45 PM

దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతాల్లో భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఢిల్లీ నగరానికి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌ సమీప ప్రాంతాల్లో గురువారం సాయత్రం భారీ వడగళ్ల వాన  కురిసింది. భారీ ఈదురు గాలులు వీస్తూ.. వర్షం ప్రారంభమైన కాసేపటికే.. వడగళ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉండి..  వర్షం పడటంతో సమీప ప్రాంతమంతా చల్లబడిపోయింది. అయితే.. నోయిడా, ఘజియాబాద్‌ సమీపంలో వర్షం పడుతుండగా.. ఢిల్లీలోని ఏ ప్రాంతంలో […]

దేశ రాజధాని సమీప ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతాల్లో భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఢిల్లీ నగరానికి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌ సమీప ప్రాంతాల్లో గురువారం సాయత్రం భారీ వడగళ్ల వాన  కురిసింది. భారీ ఈదురు గాలులు వీస్తూ.. వర్షం ప్రారంభమైన కాసేపటికే.. వడగళ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉండి..  వర్షం పడటంతో సమీప ప్రాంతమంతా చల్లబడిపోయింది. అయితే.. నోయిడా, ఘజియాబాద్‌ సమీపంలో వర్షం పడుతుండగా.. ఢిల్లీలోని ఏ ప్రాంతంలో కూడా వర్షం ఆనవాళ్లు లేవు. సమీప ప్రాంతాల్లో భారీ వర్షం, వడగళ్లు పడుతుంటే.. స్థానికులు ఆ చిత్రాలను తీస్తూ.. సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ.. వారి సంబరాలను షేర్‌ చేసుకుంటున్నారు.

కాగా.. ఢిల్లీలో మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.