పాక్ కవ్వింపు చర్యలు.. నౌషెరా సెక్టర్‌లో కాల్పులు

| Edited By:

Jul 06, 2019 | 11:53 AM

పాకిస్థాన్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో సారి ఉల్లంఘించింది. శుక్రవారం రాత్రి సరిహద్దు వెంట మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా సమాధానం ఇచ్చింది. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కాల్పుల్లో ఏలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. కాగా, పుల్వామా, బాలాకోట్ ఘటనల అనంతరం పాక్ […]

పాక్ కవ్వింపు చర్యలు.. నౌషెరా సెక్టర్‌లో కాల్పులు
Follow us on

పాకిస్థాన్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో సారి ఉల్లంఘించింది. శుక్రవారం రాత్రి సరిహద్దు వెంట మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా సమాధానం ఇచ్చింది. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కాల్పుల్లో ఏలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. కాగా, పుల్వామా, బాలాకోట్ ఘటనల అనంతరం పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.