తనకు కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహాపై ఆసుపత్రిలో చేరుతున్నానని, గత కొద్ధి రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో గల మేదాంత ఆసుపత్రిలో ఆయన చేరారు. కరోనా పాజిటివ్ కి గురైన కేంద్ర మంత్రుల్లో షేఖావత్ ఆరోవారు. లోగడ హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఇదే ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు.
కాగా….కరోనా వైరస్ పాజిటివ్ అంటే భయపడరాదని, రోగ నిరోధక శక్తి,, చికిత్సతో కోలుకోవచ్చునని గజేంద్ర సింగ్ షె ఖావత్ పేర్కొన్నారు.