రామ్ దేవ్ బాబా ఆయుర్వేద మందు ‘కొరొనిల్’ ని కోవిద్ రోగులకు ఫ్రీగా ఇస్తాం, హర్యానా ప్రభుత్వం…

| Edited By: Phani CH

May 25, 2021 | 10:10 AM

బాబా రాందేవ్ బాబా ఆయుర్వేద మందు 'కొరొనిల్' ని రాష్ట్రంలోని కోవిద్ రోగులకు తాము ఉచితంగా ఇస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

రామ్ దేవ్ బాబా ఆయుర్వేద మందు కొరొనిల్ ని కోవిద్ రోగులకు ఫ్రీగా  ఇస్తాం, హర్యానా ప్రభుత్వం...
Haryana To Give 1 Lakh Kits
Follow us on

బాబా రాందేవ్ బాబా ఆయుర్వేద మందు ‘కొరొనిల్’ ని రాష్ట్రంలోని కోవిద్ రోగులకు తాము ఉచితంగా ఇస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. లక్ష పతంజలి కొరొనిల్ కిట్స్ ని వీరికి ఇస్తామని, ఇందుకయ్యే ఖర్చులో సగ భాగాన్ని పతంజలి సంస్థ, మిగతా సగ భాగాన్ని ప్రభుత్వ కోవిద్ రిలీఫ్ ఫండ్ భరిస్తుందని మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. అసలు ఈ కొరొనిల్ కోవిద్ చికిత్సలో ఉపయోగపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని లోగడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. పైగా సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. డా.హర్షవర్ధన్ సమక్షంలో బాబా రాందేవ్ ఈ మెడిసిన్ ని లాంచ్ చేయడాన్ని తప్పు పట్టింది కూడా. అలాగే ఈ విధమైన మందులను మంత్రి ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించింది. కానీ తాజాగా హర్యానా ప్రభుత్వం మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాదనలను కొట్టి పారేస్తూ కొరొనిల్ ని విస్తృతంగా రోగులకు ఇస్తామని వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిద్ కేసులు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అనిల్ విజ్ అన్నారు. గ్రామీణులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇతర మందులను కొనలేరని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. వివాదాస్పద రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలతో గ్రామీణులు కూడా చేతులు కలుపుతున్నారని, ఫలితంగా కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక తన మందుపై పెద్ద ఎత్తున వివాదం రేగడంతో బాబా రాందేవ్ ఇది కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రం పెంచుతుందని గతంలో వ్యాఖ్యానించారు. కొరొనిల్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ విభాగం సర్టిఫికెట్ ఇచ్చిందని ఆయన చెప్పుకోగా తాము ఎలాంటి ఆయుర్వేద మందును సమీక్షించలేదని, సర్టిఫై చేయలేదని ఆ సంస్థ పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దేశంలో వ్యాక్సిన్ కొరత ఆరు వారాలు మాత్రమే ! ‘కోవిడ్ కష్టాలు’ మరికొంతకాలం పాటు తప్పవు, ఆరోగ్య నిపుణుడు డా. ఎన్.కె .అరోరా

AP Crop Insurance Money: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత ఖాతాల్లో బీమా సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్