పోలీస్ స్టేషన్ లో ‘వింత ప్రొటెస్టర్’….హర్యానా రైతుల ఐడియా ఇచ్చిన ‘కిక్కే’ వేరప్పా…! దిగొచ్చిన ఖాకీలు

| Edited By: Phani CH

Jun 07, 2021 | 11:26 AM

హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా లోని పోలీసు స్టేషన్ లో ' ఓ వింత ప్రొటెస్టర్' కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఖాకీలు అరెస్టు చేసిన తమ తోటివారిని విడుదల చేయాలంటూ కొందరు రైతులు తమతో బాటు ఓ ఆవును కూడా పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు.

పోలీస్ స్టేషన్ లో వింత ప్రొటెస్టర్....హర్యానా రైతుల ఐడియా ఇచ్చిన కిక్కే వేరప్పా...! దిగొచ్చిన ఖాకీలు
Haryana Farmer
Follow us on

హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా లోని పోలీసు స్టేషన్ లో ‘ ఓ వింత ప్రొటెస్టర్’ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఖాకీలు అరెస్టు చేసిన తమ తోటివారిని విడుదల చేయాలంటూ కొందరు రైతులు తమతో బాటు ఓ ఆవును కూడా పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అన్నదాతలను అరెస్టు చేస్తుండగా చూసిన ఇది 41 వ ‘సాక్షి’ అంటూ ఆ మూగజీవాన్ని తెచ్చి స్టేషన్ లోని ఓ స్తంభానికి కట్టేశారు. పైగా ఈ గోమాతకు ఆహారం (గడ్డి), నీళ్లు ఇచ్చే బాధ్యత పోలీసులదేనంటూ ఆ బాధ్యతను వారికే అప్పగించారు. తప్పదన్నట్టు ఖాకీలే ఆ గోమాత ముందు బకెట్ నీళ్లు పెట్టి.. అక్కడే గడ్డి కూడా వేశారు. ఈ వింత ప్రొటెస్టర్ ను రైతులు ఏ ముహూర్తాన పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారో గానీ.. అరెస్టు చేసిన అన్నదాతలను పోలీసులు నిన్న రాత్రి విడుదల చేశారు.. ఇదంతా ఆవు ‘ప్రత్యక్షంగా చూసిందని’ ఆ తరువాత అన్నదాతలు సంబరంగా చెప్పారు. కాగా అంతకుముందు వారిని విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కొన్ని గంటలపాటు పోలీసు స్టేషన్ లోనే ధర్నా చేశారు. వారిని రిలీజ్ చేసేంతవరకు ధర్నా విరమించేది లేదని హెచ్చరించారు. ఇటీవల హర్యానా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ బబ్లీ ఇంటిని కొందరు రైతులు చుట్టుముట్టి ఆందోళన చేశారట., కేంద్రం తెచ్చిన వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేసేలా చూడడంలో ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.

అయితే వారిని ఆయన దుర్భాషలాడడం….దీనిపై పెద్దఎత్తున అన్నదాతలు నిరసన ప్రకటించడంతో చివరకు ఆయన క్షమాపణ చెప్పడం తెలిసిందే. పోలీసులు అరెస్టు చేసిన అన్నదాతలను విడుదల చేయడంలో జాప్యం జరిగి ఇంత కథకు దారి తీసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: 18-44ఏళ్ళ మధ్య వయస్సు వారికే కోవాగ్జిన్ వ్యాక్సిన్…..అది కూడా రెండో డోసు మాత్రమే ! ఢిల్లీ సర్కార్ ఆదేశం

Viral Video: వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మ పట్టుకున్న మహిళ… రెస్క్యూ టీం తెగువ.. ( వీడియో )